ఐపీఎల్లో నేడు డబుల్ డెక్కర్ మ్యాచులు.. ఆర్సీబీకీ చావో రేవో
ఐపీఎల్ 2024 లో నేడు సండే ధమాకా లో భాగంగా రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం మొదటి మ్యాచులో ఆర్సీబీ, కలకత్తా జట్లు తలపడనుండగా, రెండో మ్యాచ్ లో సాయంత్రం పంజాబ్, గుజరాత్ జట్లు తలపడనున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2024 లో నేడు సండే ధమాకా లో భాగంగా రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం మొదటి మ్యాచులో ఆర్సీబీ, కలకత్తా జట్లు తలపడనుండగా, రెండో మ్యాచ్ లో సాయంత్రం పంజాబ్, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో ఘోరమైన పరాజయాలను మూటగట్టుకున్న ఆర్సీబీ నేటి మ్యాచులో ఓడిపోతే ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంటుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన బెంగళూరు జట్టు కేవలం ఒక్క మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ ఫలితంతో ఆర్సీబీకి చావో రేవో తేలనుంది. మరోపక్క కేకేఆర్ జట్టు ఈ రోజు తమ సొంత గ్రౌండ్ లో ఆడనుండగా.. ఇప్పటికే ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలతో ఆ జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో మొదటి మ్యాచ్ ఆర్సీబీ, కలకత్తా జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరగనుంది. అలాగే సాయంత్రం జరిగే రెండో మ్యాచ్ కూడా.. ఇరు జట్లు మధ్య టఫ్ ఫైట్ కొనసాగనుంది. పాయింట్ల పట్టికలో 8,9వ స్థానంలో ఉన్న ఇరు జట్లు గెలుపుకోసం తమతహలాడుతున్నాయి. ఈ రెండు మ్యాచులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మ్యాచులు పూర్తిగా చూడాల్సిందే మరి.