ఐపీఎల్ లో ఓ చెత్త రికార్డు నమోదు చేసిన దినేష్ కార్తీక్
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు.
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో డీకే గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. దీంతో అతను ఐపీఎల్ లో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆర్సీబీ - ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ వేసిన 15వ ఓవర్లో ఫస్ట్ బాల్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఔటయ్యాడు. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన దినేశ్ కార్తీక్.. తను ఎదుర్కున్న తొలి బంతికే భారీ షాట్ ఆడబోయి లలిత్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన మన్‌దీప్ సింగ్ (కేకేఆర్)తో సమంగా నిలిచాడు. మన్‌దీప్ సింగ్ ఐపీఎల్ లో ఏకంగా 15 సార్లు డకౌట్ అయ్యాడు.