1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు.. అరుదైన రికార్డు సాధించిన జడేజా
చెన్నయ్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో 100 క్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు.
దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో 100 క్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. కోల్‌కతాపై బంతితో సత్తాచాటిన అతను.. ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. సాల్ట్, శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌లను అందుకున్నాడు. ముస్తాఫిజుర్ వేసిన ఆఖరి ఓవర్‌లో అయ్యర్ ఇచ్చిన క్యాచ్ పట్టుకోవడంతో జడేజా 100 క్యాచ్‌ల ఫీట్‌ను సాధించాడు. ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పూర్తి చేసిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో విరాట్ కోహ్లీ(110) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా(109), కీరన్ పొలార్డ్(103), రోహిత్ శర్మ(100), జడేజా(100) ఉన్నారు. 100వ క్యాచ్‌తో జడేజా అరుదైన రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 1000 పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్‌లు పట్టిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.