IPL 2023: 217 పరుగుల భారీ స్కోర్ చేసిన సీఎస్కే

టాటా ఐపీఎల్ 2023లో భాగంగా సొంత గ్రౌండ్ చెపాక్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సీఎస్కే 200 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Update: 2023-04-03 16:06 GMT

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023లో భాగంగా సొంత గ్రౌండ్ చెపాక్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సీఎస్కే 7 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లుగా బరిలోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్, కాన్వే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వారిద్దరు కలిసి మొదటి వికెట్ కు 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం జట్టు స్కోర్ 110 వద్ద  గైక్వాడ్  (57) బిష్ణోయ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. శివమ్ దూబేతో కలిసి కాన్వే ఆటను కొనసాగించాడు.

అయితే జట్టు స్కోర్ 118 వద్ద వుడ్ బౌలింగ్ లో కాన్వే (47) పాండ్యాకు దొరికిపోయాడు. ఇక అనంతరం క్రీజులోకి వచ్చి శివమ్ దూబే 27, రాయుడు 27 , మోయిన్ అలీ 19 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. చివర్లో వచ్చిన ధోనీ.. వరుసగా రెండు సిక్స్ లు కొట్టి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు. అయితే నెక్స్ట్ బాల్ కే మహీ అవుటయ్యాడు.

Tags:    

Similar News