‘ఆ ఏకైక కోరికతో జట్టుకు గుడ్ బై చెబుతున్నా’.. చెన్నై స్టార్ ప్లేయర్ ఎమోషనల్ ట్వీట్
యంగ్ అండ్ డెత్ బౌలర్ స్పెషలిస్ట్ బౌలర్ మతీష పతిరణ ఐపీఎల్ 2024 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు దూరం అయ్యాడు. తొడ కండరాల గాయం
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ అండ్ డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ మతీష పతిరణ ఐపీఎల్ 2024 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు దూరం అయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా ఈ యంగ్ బౌలర్ ఐపీఎల్ నుండి వెదొలిగాడు. దీంతో పతిరణ సొంత దేశమైన శ్రీలంకకు బయలుదేరాడు. ఈ నేపథ్యంలో అతడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జట్టుకు వీడ్కోలు పలుకుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ‘2024 ఐపీఎల్ ట్రోఫీని సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్‌లో చూడాలనే ఏకైక కోరికతో ఈ సీజన్‌లో జట్టుకు గుడ్ బై చెబుతున్నా. చెన్నై నుండి నేను పొందిన ప్రేమ, అభిమానానికి సీఎస్కే యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని పతిరణ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు.
కాగా, సీఎస్కే విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న పతిరణ.. కీలకమైన ఫ్లే ఆఫ్స్ ముంగిట జట్టుకు దూరం అవ్వడం డిఫెండింగ్ ఛాంపియన్‌కు భారీ ఎదురు దెబ్బేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. డెత్ ఓవర్లలో మతిశా పతిరణ సీఎస్కేకు కీలకంగా మారాడు. పరుగులను నియంత్రించడంతో పాటు అవసరమైన సమయంలో వికెట్లు తీసి జట్టులో ఇంపార్టెంట్ ప్లేయర్‌గా మారాడు. ఈ సమయంలో గాయం కారణంగా పతిరణ జట్టుకు దూరం అవ్వడం సీఎస్కేకు ఒకింత నష్టమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.