IPLలో కోహ్లీ మరో సరికొత్త రికార్డ్.. లీగ్ హిస్టరీలోనే ఏకైక్ ప్లేయర్‌గా ఘనత
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 700 ప్లస్
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 700 ప్లస్ రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతోన్న కోహ్లీ.. తాజాగా ఐపీఎల్‌లో మరో కొత్త రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలోనే 8000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రన్ మెషిన్ నయా రికార్డ్ క్రియేట్ చేశాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత సాధించాడు. కోహ్లీ తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ 6,769 పరుగులతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.
ఇక, ఐపీఎల్‌లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్లేయర్‌గా కొనసాగుతోన్న కోహ్లీ.. లీగ్ హిస్టరీలో ఇప్పటి వరకు 8 సెంచరీలు, 55 అర్థ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ ప్రారంభం నుండి ఒకే ఫ్రాంచైజ్‌కు (ఆర్సీబీ) ప్రాతినిధ్యం వహిస్తోన్న కోహ్లీ.. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడకపోవడం విశేషం. ప్రతి సీజన్‌లో కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తోన్న.. టీమ్ అంచనాలకు తగ్గట్లు రాణించకపోవడంతో ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీకి అందని ద్రాక్షగానే మిగిలింది. అనూహ్య విజయాలతో ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఆర్సీబీ.. ఈ సారైనా టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి మరీ.