హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు

హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీపై సౌతాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఏబీడీ

Update: 2024-05-10 09:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీపై సౌతాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఏబీడీ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ సారథి హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో అహంకారం స్పష్టంగా కనిపిస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ వంటి సీనియర్లు జట్టులో ఉన్నప్పుడు అలాంటి అహంకారిపూరిత ధోరణి పనికిరాదని చురకలంటించారు. జట్టులో అనువభ్ఞులు ఉన్నప్పుడు వారి నుండి సలహాలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని హితవు పలికారు. హార్ధిక్ ధోని మాదిరిగా కెప్టెన్సీ చేయాలని ప్రయత్నిస్తున్నాడని.. కానీ అది ముంబై టీమ్‌లో పనికి రాదని అన్నాడు. యువ ప్లేయర్లు ఉన్న గుజరాత్ టీమ్‌లో అయితే సెట్ అవుతోందని సూచించారు. పాండ్యా కంటే ఎక్స్‌పర్స్ట్ ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్‌లో అతడి అహంకారపూరిత కెప్టెన్సీని అందరూ అంగీకరించారని కీలక వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టైటిల్స్ నెగ్గిన ఎమ్‌ఐ జట్టుకు ఈ సారి రోహిత్ శర్మను తప్పించి పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలమైంది. ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన ముంబై.. 8 మ్యాచుల్లో ఓడి.. కేవలం నాలుగు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో ముంబై కెప్టెన్ హర్థిక్ పాండ్యా సారథ్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పాండ్యా కెప్టెన్సీపై ఏబీడీ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.


Similar News