ఇండియాలోనే ఐపీఎల్ : బీసీసీఐ
దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరుగబోయే ఐపీఎల్ 14వ సీజన్‌ను ఇండియాలోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ శనివారం తెలిపారు. ‘గత ఏడాది కరోనా కారణంగా ఐపీఎల్‌ను యూఏఈకి తరలించాము. కానీ ఈ సారి మాత్రం ఇండియాలోనే ఈ మెగా టోర్నీని నిర్వహించాలనుకుంటున్నాము. అయితే ఐపీఎల్ కంటే ముందే ఆటగాళ్లందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాము’ అని అరుణ్ ధుమాల్ ఒక వార్తా ఏజెన్సీకి వెల్లడించారు. […]
దిశ, స్పోర్ట్స్ : క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జరుగబోయే ఐపీఎల్ 14వ సీజన్‌ను ఇండియాలోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ శనివారం తెలిపారు. ‘గత ఏడాది కరోనా కారణంగా ఐపీఎల్‌ను యూఏఈకి తరలించాము. కానీ ఈ సారి మాత్రం ఇండియాలోనే ఈ మెగా టోర్నీని నిర్వహించాలనుకుంటున్నాము. అయితే ఐపీఎల్ కంటే ముందే ఆటగాళ్లందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాము’ అని అరుణ్ ధుమాల్ ఒక వార్తా ఏజెన్సీకి వెల్లడించారు.
బీసీసీఐ కోశాధికారి హోదాలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న ధుమాల్.. ఈ విషయాన్ని స్పష్టం చేయడం అంటే స్వయంగా బోర్డు చెప్పినట్లే భావించవచ్చు. ఈ సీజన్ తప్పకుండా ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నదని, వేరే చోట నిర్వహించాలనే ఆలోచన కూడా చేయడం లేదని ధుమాల్ స్పష్టం చేశారు. ప్రస్తుత స్థితలో యూఏఈ కంటే ఇండియానే చాలా సురక్షితమని.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభమైనందు వలన పెద్దగా భయపడాల్సిన పని కూడా లేదని ధుమాల్ అంటున్నారు. ఈ ఏడాది రంజీ ట్రోఫీ కూడా రద్దు చేసినందున ఐపీఎల్ స్వదేశంలోనే నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది.