జులైకి మారనున్న ఐపీఎల్-13 షెడ్యూల్?
ఐపీఎల్-13 సీజన్ నిర్వహణపై ఇంకా సందిగ్ధం వీడటం లేదు. కరోనా ప్రభావంతో ప్రస్తుతానికి ఏప్రిల్ 15కు వాయిదా వేసినా.. అప్పుడైనా ఈ లీగ్ ప్రారంభం అవుతుందో లేదో అనుమానమే. కానీ బీసీసీఐ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది ఐపీఎల్‌ను నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ రద్దయితే బీసీసీఐకే కాక ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదముంది. దీంతో బోర్డు పెద్దలు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నారు. కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో రాబోయే రెండు […]
ఐపీఎల్-13 సీజన్ నిర్వహణపై ఇంకా సందిగ్ధం వీడటం లేదు. కరోనా ప్రభావంతో ప్రస్తుతానికి ఏప్రిల్ 15కు వాయిదా వేసినా.. అప్పుడైనా ఈ లీగ్ ప్రారంభం అవుతుందో లేదో అనుమానమే. కానీ బీసీసీఐ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది ఐపీఎల్‌ను నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. ఐపీఎల్ రద్దయితే బీసీసీఐకే కాక ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదముంది. దీంతో బోర్డు పెద్దలు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తున్నారు.
కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటంతో రాబోయే రెండు నెలల్లో ఐపీఎల్ నిర్వహణ దాదాపు అసాధ్యంగానే కనపడుతోంది. దీంతో జులై-సెప్టెంబర్ మధ్య ఐపీఎల్ నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. జులైలో శ్రీలంకతో సిరీస్ తర్వాత, సెప్టెంబర్‌లో ఆసియాకప్‌కు ముందు భారత జట్టు ఖాళీగానే ఉంటుంది. ఆ సమయంలో పాకిస్తాన్‌లో ఇంగ్లాండ్ పర్యటన మినహా పెద్ద సిరీస్‌లు కూడా లేకపోవడంతో విదేశీ క్రీడాకారులు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
2009లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఐపీఎల్‌ను 37 రోజుల పాటు దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఇప్పుడు కూడా జులై-సెప్టెంబర్ మధ్యలో పూర్తిస్థాయి ఐపీఎల్ జరపాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
Tags: IPL, BCCI, July, Franchisees, Team India, Broadcasters