ఆర్సీబీ రాత ఈ సారైనా మారేనా?
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఎక్కువ అంచనాలు పెట్టుకొని.. నిరాశ పరిచే జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ముందు వరుసలో ఉంటుంది. పేపర్‌పై చూస్తే అద్భుతమైన బ్యాటింగ్ లైనప్‌తో చాలా బలంగా కనపడుతుంది. తీరా మైదానంలోకి అడుగుపెట్టాక పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశపెడుతున్నది. గత సీజన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పై ఎక్కువగా ఆధారపడింది. మొదట్లో విజయాలతో దూసుకొని వెళ్లి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ లీగ్ […]
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత ఎక్కువ అంచనాలు పెట్టుకొని.. నిరాశ పరిచే జట్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ముందు వరుసలో ఉంటుంది. పేపర్‌పై చూస్తే అద్భుతమైన బ్యాటింగ్ లైనప్‌తో చాలా బలంగా కనపడుతుంది. తీరా మైదానంలోకి అడుగుపెట్టాక పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశపెడుతున్నది. గత సీజన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌పై ఎక్కువగా ఆధారపడింది. మొదట్లో విజయాలతో దూసుకొని వెళ్లి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ లీగ్ చివరిలో వరుసగా 5 మ్యాచ్‌లు ఓడిపోయి అతి కష్టం మీద ప్లేఆఫ్స్ చేరుకున్నది. అయితే ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి మరోసారి కప్ గెలువకుండానే ఇంటిబాట పట్టింది. ఐపీఎల్ ఆక్షన్ సందర్భంగా 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆర్సీబీ.. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన గ్లెన్స్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 14.25 కోట్లకు కొని అందరికీ షాక్ ఇచ్చింది. మరి ఈ సీజన్‌లో జట్టు బలాబలాలేమిటో ఒకసారి చూద్దాం.
బ్యాటింగే బలం..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రధాన బలం బ్యాటింగ్. టాప్ ఆర్డర్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్‌లకు తోడు యువ క్రికెటర్లు కూడా తోడుగా ఉన్నారు. ఈ సీజన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడని ఇప్పటికే జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. అతడికి తోడు దేవ్‌దత్ పడిక్కల్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కరోనా కారణంగా తొలి మ్యాచ్‌కు పడిక్కల్ అందుబాటులో ఉండటం లేదు. అతడి స్థానంలో ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన ఫిన్ అలెన్‌ను ఓపెనర్‌గా దిగవచ్చు. ఫస్ట్ డౌన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ బ్యాటింగ్ కొనసాగిస్తారు. మిడిల్ ఆర్డర్‌లో కొత్త ఆటగాడు మహ్మద్ అజారుద్దీన్‌ను బ్యాటింగ్‌కు పంపే అవకాశం ఉన్నది. విజయ్ హజారే ట్రోఫీలో అజారుద్దీన్ తమిళనాడు తరపున అద్బుతమైన ప్రదర్శన చేసి ఫామ్‌లో ఉన్నాడు. నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్‌ల నేతృత్వంలో బౌలింగ్ దళం బలంగా కనపడుతున్నది. వీరికి తోడు కేన్ రిచర్డ్‌సన్, కైల్ జేమిసన్, డాన్ క్రిస్టియన్‌లు అందుబాటులో ఉన్నారు. దేశీయ బౌలర్ హర్షల్ పటేల్ సేవలు కూడా ఉపయోగపడతాయి. ఇక స్పిన్ విభాగంలో యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, ఆడమ్ జంపా, షాబాజ్ అహ్మద్ ప్రత్యర్థులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. కాగా, జట్టులో ఎక్కువగా విదేశీ క్రికెటర్లు ఉన్నారు. అయితే నలుగురి కంటే ఎక్కువ మంది తుది జట్టులో ఉండే అవకాశం లేకపోవడంతో జట్టు ఎంపిక కెప్టెన్ కోహ్లీకి కష్టంగా మారే అవకాశం ఉన్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బలమైన బ్యాటింగ్ లైనప్‌తో దిగుతుండటంతో ఈ సారి ఎటాకింగ్ గేమ్ ఆడే అవకాశం ఉన్నది. మరి ఈ సారైనా కప్పు గెలిచి తమపై ఉన్న అపవాదును పోగొట్టుకుంటుందో లేదో చూడాలి.
జట్టు సభ్యులు :
విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, సచిన్ బేబీ, రజత్ పటిదార్, సూర్యాశ్ ప్రభుదేశాయ్, ఫిల్ అలెన్, పవన్ దేశ్‌పాండే, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, జోష్ ఫిలిప్, మహ్మద్ అజారుద్దీన్, కేఎస్ భరత్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, ఆడమ్ జంపా, షాబాజ్ అహ్మద్, నవదీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, కేన్ రిచర్డ్‌సన్, డేనియల్ సామ్స్, హర్షల్ పటేల్, కైల్ జేమిసన్, డాన్ క్రిస్టియన్
మ్యాచ్‌ల వివరాలు
ముంబయి – ఏప్రిల్ 9
హైదరాబాద్ – ఏప్రిల్ 14
కోల్‌కతా – ఏప్రిల్ 18
రాజస్థాన్ – ఏప్రిల్ 22
చెన్నై – ఏప్రిల్ 25
ఢిల్లీ – ఏప్రిల్ 27
పంజాబ్ – ఏప్రిల్ 30
కోల్‌కతా – మే 3
పంజాబ్ – మే 6
హైదరాబాద్ – మే 9
ఢిల్లీ – మే 14
రాజస్థాన్ – మే 16
ముంబయి – మే 20
చెన్నై – మే 23
గత సీజన్ : 4వ స్థానం
యువ, సీనియర్ ప్లేయర్లతో కూడిన కోల్‌కతా
ఐపీఎల్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ఇటీవల సీజన్లలో కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోవడం లేదు. కేకేఆర్ కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ తప్పుకున్న తర్వాత ఆ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. దినేష్ కార్తీక్ కెప్టెన్సీలో సరైన ప్రదర్శన చేయలేదు. ఇక గత సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత కార్తీక్ కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్నాడు. అనూహ్యంగా ఇయాన్ మోర్గాన్ జట్టు పగ్గాలు చేపట్టాడు. కానీ అప్పటికే ఓటములతో ఉన్న జట్టు కోలుకోలేకపోయింది. యువకులు, సీనియర్లతో కూడిన కేకేఆర్‌కు ఈ సారి మోర్గాన్ పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో మంచి అనుభవం ఉన్న మోర్గాన్ జట్టుకు పెద్ద బలం. శుభమన్‌గిల్, నితీష్ రాణా ఓపెనర్లుగా రాణిస్తున్నారు. ఒక వేళ రాణాను మూడో స్థానంలో ఆడిస్తే రాహుల్ త్రిపాఠి ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉన్నది. నాలుగో స్థానంలో దినేష్ కార్తీక్ సరైన చాయిస్. ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ ఆడటం వల్ల బ్యాటింగ్ లైనప్ బలం పెరుగుతుంది. లోయర్ మిడిల్‌లో ఆండ్రీ రస్సెల్, సునిల్ నరైన్ జట్టుకు మంచి హిట్టర్లుగా పరుగులు సాధిస్తారు. షకీబుల్ హసన్ జట్టులో చేరడం ఒక పెద్ద అస్సెట్ అని చెప్పవచ్చు. బంతితోనే కాకుండా బ్యాటుతో కూడా రాణించగల సత్తా ఉన్నది. ప్రసిధ్ కృష్ణ, పాట్ కమ్మిన్స్ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నారు. వరుణ్ చక్రవర్తికి తోడు సీనియర్ హర్బజన్ స్పిన్ దళాన్ని నడిపించగలరు. అయితే తుది జట్టులో ఎవరో ఒకరికే చోటు దక్కే అవకాశం ఉన్నది. కుల్దీప్ యాదవ్ పరిస్థితి కూడా అంతే. కాకపోతే ఇటీవల పేలవ ఫామ్ కారణంగా బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉన్నది.
వ్యూహాలు ముఖ్యం..
కోల్‌కతా జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్లతో నిండి ఉన్నది. ఇయాన్ మోర్గాన్ వైట్ బాల్ క్రికెట్‌లో మంచి వ్యూహకర్తగా పేరున్నది. 2019లో ఇంగ్లాండ్ జట్టుకు ప్రపంచ కప్ అందించడంలో మోర్గాన్‌ది కీలకపాత్ర. స్వయంగా మంచి బ్యాట్స్‌మాన్ అయిన మోర్గాన్.. జట్టును సరైన దిశలో నడిపించడంలో అనుభవం ఉన్నది. గత సీజన్‌లో 7 మ్యాచ్‌ల అనంతరం పగ్గాలు చేపట్టడంతో జట్టుపై పట్టు సాధించలేకపోయాడు. దినేష్ కార్తీక్‌పై కెప్టెన్సీ భారం లేకపోవడంతో అతడు పూర్తి స్థాయిలో బ్యాటింగ్‌పై దృష్టిపెట్టే అవకాశం ఉన్నది. స్వతహాగా మంచి బ్యాట్స్‌మెన్ అయిన కార్తీక్.. నిలకడ లేమి కారణంగానే గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడును విజయవంతంగా నడిపించిన కార్తీక్.. కేకేఆర్ బ్యాటింగ్ బ్యాధ్యతలు కూడా సక్రమంగా మోస్తే జట్టుకు పెద్ద బలంగా మారతాడు. వీరిద్దరికీ తోడు ఆండ్రూ రస్సెల్ చెలరేగితే కోల్‌కతాను ఆపడం ఎవరి వల్ల అవదు. మరి ఈ సీజన్‌లో ఏం చేస్తారో వేచి చూడాలి.
జట్టు :
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్, శుభ్‌మన్ గిల్, నితీష్ రాణా, టిమ్ సీఫెర్ట్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునిల్ నరైన్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావీ, లాకీ ఫెర్గ్యూసన్, పాట్ కమిన్స్, కమలేష్ నాగర్‌కోటి, సందీప్ వారియర్, ప్రసిధ్ కృష్ణ, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, షెల్డన్ జాక్సన్, వైభవ్ అరోర, హర్భజన్ సింగ్, కరుణ్ నాయర్, బెన్ కటింగ్, వెంకటేష్ అయ్యర్, పవన్ నేగి
లీగ్ మ్యాచ్‌లు
హైదరాబాద్ – ఏప్రిల్ 11
ముంబయి – ఏప్రిల్ 13
బెంగళూరు – ఏప్రిల్ 18
చెన్నై – ఏప్రిల్ 21
రాజస్థాన్ – ఏప్రిల్ 24
పంజాబ్ – ఏప్రిల్ 26
ఢిల్ల – ఏప్రిల్ 29
బెంగళూరు – మే 3
ఢిల్లీ – మే 8
ముంబయి – మే 10
చెన్నై – మే 12
పంజాబ్ – మే 15
రాజస్థాన్ – మే 18
హైదరాబాద్ – మే 21
గత సీజన్ : 5వ స్థానం