ఐపీఎల్ వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది : రవిశాస్త్రి

దిశ, స్పోర్ట్స్ : మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మంచి ప్రదర్శన కనబర్చిన శుభమన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లను హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆకాశానికెత్తేశాడు. ఇద్దరు యువ క్రికెటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదని.. తమ బాధ్యతను వాళ్లు సక్రమంగా నిర్వర్తించారని శాస్త్రి వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లో రాణించడం ద్వారా యువ క్రికెటర్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. అదే మానసిక ధైర్యంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రాణించారని అన్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో విజయానికి కెప్టెన్ అజింక్య […]

Update: 2020-12-30 10:09 GMT

దిశ, స్పోర్ట్స్ : మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మంచి ప్రదర్శన కనబర్చిన శుభమన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లను హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆకాశానికెత్తేశాడు. ఇద్దరు యువ క్రికెటర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదని.. తమ బాధ్యతను వాళ్లు సక్రమంగా నిర్వర్తించారని శాస్త్రి వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌లో రాణించడం ద్వారా యువ క్రికెటర్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని.. అదే మానసిక ధైర్యంతో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రాణించారని అన్నాడు. మెల్‌బోర్న్ టెస్టులో విజయానికి కెప్టెన్ అజింక్య రహానే సెంచరీతో పాటు వీరిద్దరి పాత్రకూడా సహాయపడిందని రవిశాస్త్రి వెల్లడించాడు. పృథ్వీషా స్థానంలో జట్టులోకి వచ్చిన గిల్ తన సహజశైలిలో ఆడాడని.. అతడు ఇలాగే కొనసాగితే జట్టులో స్థానాన్ని పదిలపరుచుకోవచ్చని అన్నాడు. ఇక మహ్మద్ సిరాజ్ కూడా చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసురుతున్నాడని.. ఆస్ట్రేలియా పిచ్‌లు అతడికి మంచిగా సహకరిస్తున్నాయని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

 

Tags:    

Similar News