10 సెకన్ల యాడ్‌కు రూ.10 లక్షలు

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే కాసుల పంట. ఇటు బీసీసీఐ (BCCI)కే కాక అటు బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌(Star Sports)కూ పెద్ద ఆదాయ వనరు. గత 12 సీజన్ల ఆదాయ గణాంకాలు (Revenue statistics) పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఈ ఏడాది ఇంతవరకు స్టార్ స్పోర్ట్స్‌ (Star Sports)లో లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారం కాలేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలు రద్దు కావడంతో ఇప్పట్లో హోం సిరీస్‌ (Home Series)లు […]

Update: 2020-08-14 09:46 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే కాసుల పంట. ఇటు బీసీసీఐ (BCCI)కే కాక అటు బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌(Star Sports)కూ పెద్ద ఆదాయ వనరు. గత 12 సీజన్ల ఆదాయ గణాంకాలు (Revenue statistics) పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఈ ఏడాది ఇంతవరకు స్టార్ స్పోర్ట్స్‌ (Star Sports)లో లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రసారం కాలేదు.

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ పర్యటనలు రద్దు కావడంతో ఇప్పట్లో హోం సిరీస్‌ (Home Series)లు కూడా లేకుండా పోయాయి. దీంతో ఇన్నాళ్లూ కోల్పోయిన ఆదాయాన్ని ఐపీఎల్ (IPL) ద్వారా రాబట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. యూఏఈలో ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ జరగనుండటంతో ఈసారి భారీ స్థాయిలో వ్యూవర్‌షిప్ (Viewership)పెరిగే అంచనాలు ఉన్నట్లు స్టార్ సర్వేలో వెల్లడైంది.

దీంతో గతంలో కంటే యాడ్స్ రేటును భారీగా పెంచినట్లు తెలుస్తున్నది. గత సీజన్‌లో యాడ్స్ (Ads) ద్వారా స్టార్ రూ.3వేల కోట్లు సంపాదించగా, ఈసారి అంతకు మించి అంచనాలు పెంచింది. తాజా సీజన్‌లో 10 సెకెన్ల యాడ్‌కు రూ.10లక్షల ధర నిర్ణయించింది. ఐపీఎల్ (IPL) సీజన్‌లోనే దీపావళి, దసరా పండుగలు కూడా వస్తుండటంతోపాటు ఇప్పుడిప్పుడే వ్యాపారాలు పుంజుకుంటుండటం స్టార్ ఇండియాకు కలిసొచ్చే అంశం. గతేడాది ప్రపంచ కప్ (World Cup) సమయంలో 10సెకన్లకు దాదాపు రూ.18 లక్షలు వసూలు చేసిన స్టార్ స్పోర్ట్స్, ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో 10 సెకెన్లకు రూ.25లక్షలు వసూలు చేయడం గమనార్హం.

Tags:    

Similar News