ఒలింపిక్స్‌లో అథ్లెట్ల బెర్తులు యథాతథం : ఐవోసీ

క్రీడా ప్రపంచంలో అతిపెద్ద పండుగైన ఒలింపిక్స్ క్రీడలు ఈ ఏడాది టోక్యోలో జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి ప్రభావంతో 2021 వేసవికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా, ఒలింపిక్స్ 2020 వాయిదా పడటంతో అథ్లెట్స్‌లో ఆందోళన నెలకొంది. ఒలింపిక్స్‌లోని పలు క్రీడా ఈవెంట్లలో ఇప్పటికే 57 శాతం మంది బెర్తులు దక్కించుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితిపై గందరగోళం నెలకొనగా.. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐవోసీ) దానిపై వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు అర్హత సాధించిన వారి […]

Update: 2020-03-28 04:23 GMT

క్రీడా ప్రపంచంలో అతిపెద్ద పండుగైన ఒలింపిక్స్ క్రీడలు ఈ ఏడాది టోక్యోలో జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి ప్రభావంతో 2021 వేసవికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా, ఒలింపిక్స్ 2020 వాయిదా పడటంతో అథ్లెట్స్‌లో ఆందోళన నెలకొంది. ఒలింపిక్స్‌లోని పలు క్రీడా ఈవెంట్లలో ఇప్పటికే 57 శాతం మంది బెర్తులు దక్కించుకున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితిపై గందరగోళం నెలకొనగా.. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐవోసీ) దానిపై వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు అర్హత సాధించిన వారి బెర్తులు వచ్చే ఏడాది వరకు అలాగే కొనసాగుతాయని శుక్రవారం ప్రకటించింది.

32 అంతర్జాతీయ క్రీడా సంఘాలతో ఐవోసీ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సు అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఐవోసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపాడు. అర్హత సాధించిన వాళ్లందరూ వచ్చే ఏడాది ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. కాగా ఇంకా ఖాళీగా ఉన్న బెర్తుల కోసం జరపాల్సిన అర్హత టోర్నమెంట్లను వచ్చే ఏడాది ఒలింపిక్స్ క్రీడలకు మూడు నెలల ముందుగా నిర్వహించనున్నట్టు సమాచారం.

Tags : Olympics, International Olympic Council, Tokyo, Tele conference

Tags:    

Similar News