'ఒలింపిక్ అథ్లెట్ల వీడియోలు, ఫోటోలు వాడుకోవచ్చు'
దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి వీడియోలు, ఫొటోలు, డిజిటల్ కంటెంట్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) వాడుకోవడానికి అంతర్జాతీయ ఒలంపిక్స్ కౌన్సిల్ (ఐవోసీ) అనుమతి ఇచ్చింది. భారత అథ్లెట్లకు చెందిన ఫుటేజీ, ఫొటోలు వాడుకోవడానికి తమకు అనుమతి లభించినట్లు ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఒలింపిక్స్‌కు చెందిన వీడియో, ఫొటోలు, డిజిటల్ కంటెంట్ వాడుకోవడానికి అనుమతి లభించింది. ఇండియాకు చెందిన పలువురు అథ్లెట్లు పలు కంపెనీలకు స్పాన్సర్లుగా ఉన్నారు. కాబట్టి ఒలింపిక్స్ […]
దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి వీడియోలు, ఫొటోలు, డిజిటల్ కంటెంట్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) వాడుకోవడానికి అంతర్జాతీయ ఒలంపిక్స్ కౌన్సిల్ (ఐవోసీ) అనుమతి ఇచ్చింది. భారత అథ్లెట్లకు చెందిన ఫుటేజీ, ఫొటోలు వాడుకోవడానికి తమకు అనుమతి లభించినట్లు ఐవోఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘ఒలింపిక్స్‌కు చెందిన వీడియో, ఫొటోలు, డిజిటల్ కంటెంట్ వాడుకోవడానికి అనుమతి లభించింది. ఇండియాకు చెందిన పలువురు అథ్లెట్లు పలు కంపెనీలకు స్పాన్సర్లుగా ఉన్నారు. కాబట్టి ఒలింపిక్స్ కంటెంట్‌ను ఐవోఏ ద్వారా ఆయా స్పాన్సర్లకు అందించడానికి అనుమతి లభించింది. అంతే కాకుండా మీడియాకు కూడా ఐవోఏ ద్వారా ఫుటేజీ ఇస్తాము’ అని ఐవోఏ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.