పట్టణ ప్రగతి పురస్కారాలకు ఆహ్వానం

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టణ ప్రగతి పురస్కారం-2020 అవార్డులకు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కోరింది. హరితహారం, వైకుంఠదామం, పబ్లిక్ టాయిలెట్స్, మార్కెట్స్ తదితర అంశాల వారీగా కేటాయించిన మార్కుల జాబితా ప్రకారం.. రిపోర్టులు అందించాలని సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ సూచించారు. జనాభా కేటగిరీల వారీగా మున్సిపాలిటీలకు ఓడీఎఫ్+సర్టిఫికెట్స్ అందించిన ప్రకారం మార్కులు కలుపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. శానిటేషన్, వేస్ట్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ టాయిలెట్ల సర్వీసులపై యూఎల్‌బీల పనితీరును పరిగణలోకి తీసుకుంటామని […]

Update: 2020-12-09 11:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టణ ప్రగతి పురస్కారం-2020 అవార్డులకు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కోరింది. హరితహారం, వైకుంఠదామం, పబ్లిక్ టాయిలెట్స్, మార్కెట్స్ తదితర అంశాల వారీగా కేటాయించిన మార్కుల జాబితా ప్రకారం.. రిపోర్టులు అందించాలని సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ సూచించారు. జనాభా కేటగిరీల వారీగా మున్సిపాలిటీలకు ఓడీఎఫ్+సర్టిఫికెట్స్ అందించిన ప్రకారం మార్కులు కలుపనున్నట్టు ఆయన పేర్కొన్నారు. శానిటేషన్, వేస్ట్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ టాయిలెట్ల సర్వీసులపై యూఎల్‌బీల పనితీరును పరిగణలోకి తీసుకుంటామని అందులో తెలిపారు.

Tags:    

Similar News