ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

దిశ , హైదరాబాద్: ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) 2020 సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్ ఫయాజ్ అహ్మద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) ప్రోగ్రాములలో చేరాలనుకునే వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా ప్రోగ్రాములలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జులై 31 […]

Update: 2020-06-09 03:16 GMT

దిశ , హైదరాబాద్: ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) 2020 సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ ఎస్ ఫయాజ్ అహ్మద్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్) ప్రోగ్రాములలో చేరాలనుకునే వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా ప్రోగ్రాములలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జులై 31 వ తేదీ వరకు ఆన్ లైన్ లో గానీ, ఇగ్నో వెబ్ సైట్ www.ignou.ac.in ద్వారా పూర్తి వివరాలు పొంది దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు rchyderabad@ignou.ac.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చన్నారు.

Tags:    

Similar News