SBI ఖాతాదారులకు గమనిక.. ఆ సేవలకు అంతరాయం

దిశ,వెబ్‌డెస్క్ : ఎస్‌బీఐ బ్యాంకు తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది.  దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఖాతాదారులకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అంతర్గత నిర్వహణ చర్యల్లో భాగంగా జూలై 16 శుక్రవారం రాత్రి 10.45 గంటల నుంచి జూలై17 అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ సర్వీసులు నిలిచి పోతాయని తెలిపింది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడం కోసం అప్ డేషన్ […]

Update: 2021-07-15 20:58 GMT

దిశ,వెబ్‌డెస్క్ : ఎస్‌బీఐ బ్యాంకు తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ ఖాతాదారులకు చెందిన కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడనుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అంతర్గత నిర్వహణ చర్యల్లో భాగంగా జూలై 16 శుక్రవారం రాత్రి 10.45 గంటల నుంచి జూలై17 అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ సర్వీసులు నిలిచి పోతాయని తెలిపింది. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడం కోసం అప్ డేషన్ జరుగుతోందని, అందుకోసమనే ఎస్‌బీఐ ఆన్ లైన్ సేవలకు కొంత అంతరాయం ఏర్పడుతుందని, ఖాతాదారులు తమకు సహకరించాలని ఎస్‌బీఐ కోరింది. ఈ సమయంలో ఖాతాదారులు ఎలాంటి ఆన్ లైన్ లావాదేవీలు చేయకూడదని ట్వీట్ చేసింది.

Tags:    

Similar News