'జర్నలిస్టుల సేవలు మరువలేనివి'
దిశ, జనగామ: ప్రతిక్షణం సమాజ సేవలో ముందుండే జర్నలిస్టుల సేవలు మరువలేనివని లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ డైమండ్స్ అధ్యక్షులు గట్టు శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు కన్నా పరశురాములు అన్నారు. సోమవారం ‘అంతర్జాతీయ జర్నలిస్టు డే’ ను పురస్కరించుకుని జనగామ జర్నలిస్టులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాణాపురంలోని హనుమాన్ దేవాలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు పాల్గొని జనగామకు చెందిన సీనియర్ జర్నలిస్టులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా […]
దిశ, జనగామ: ప్రతిక్షణం సమాజ సేవలో ముందుండే జర్నలిస్టుల సేవలు మరువలేనివని లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ డైమండ్స్ అధ్యక్షులు గట్టు శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు కన్నా పరశురాములు అన్నారు. సోమవారం ‘అంతర్జాతీయ జర్నలిస్టు డే’ ను పురస్కరించుకుని జనగామ జర్నలిస్టులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బాణాపురంలోని హనుమాన్ దేవాలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు పాల్గొని జనగామకు చెందిన సీనియర్ జర్నలిస్టులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం దిశగా ముందుకు సాగుతుండే వ్యక్తులు జర్నలిస్టులని, జర్నలిస్టుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు గందే వేణు, బిజ్జాల నవీన్, గట్టు వెంకటేశ్వ ర్లు, గొడిశాల శివరామకృష్ణా, దేవేందర్, గంగిశెట్టి ప్రమోద్ కుమార్, కృష్ణజీవన్ బజాజ్ పాటు జర్నలిస్టులు ఎన్ఆర్ అనిల్, కొత్తపల్లి కిరణ్ కుమార్, పబ్బా వేణుగుప్తా, ఎస్ ఆనంద్, జాల రమేష్, బండి శ్రీనివాస్ రెడ్డి, జి వై గిరి కృష్ణ, తదితులు పాల్గొన్నారు