ఇక చాలు ఆపేయండి.. అశ్లీలత, వికృత చేష్టలకు కేరాఫ్‌గా బిగ్‌బాస్ షో!
దిశ, ఖైరతాబాద్ : బిగ్‌బాస్ షోలో అశ్లీలతను నిషేధించాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు ఖియాఫస్త్ అలీ మాట్లాడుతూ.. బిగ్‌బాస్-5లో చేస్తున్న వికృత చేష్టలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. మహిళలను కించపరుస్తూ వారు చేసే విన్యాసాల వలన యువత పెడదారి పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బిగ్ బాస్ షోను లీడ్ చేస్తున్న […]
దిశ, ఖైరతాబాద్ : బిగ్‌బాస్ షోలో అశ్లీలతను నిషేధించాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు ఖియాఫస్త్ అలీ మాట్లాడుతూ.. బిగ్‌బాస్-5లో చేస్తున్న వికృత చేష్టలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. మహిళలను కించపరుస్తూ వారు చేసే విన్యాసాల వలన యువత పెడదారి పట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
బిగ్ బాస్ షోను లీడ్ చేస్తున్న నటుడు నాగార్జున మహిళలకు క్షమాపణ చెప్పిస్తూ ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారా? అని ఆరోపించారు. షో రేటింగ్ కోసం తప్పుడు ప్రమాణాలు పాటిస్తున్న బిగ్ బాస్ షోలో నానాటికి అశ్లీలత పెరిగిపోతున్నదని మండిపడ్డారు. ఈ విషయమై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, కేంద్ర కమ్యూనికేషన్ వ్యవహారాలు, ప్రసార సమాచార శాఖ, జాతీయ మహిళా కమిషన్‌లకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ షో పై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆరిఫ్ ఖాన్, ఫర్హాన బేగం, అమీర్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.