విదేశాల నుంచి విమానాలు బంద్!
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ నెల 22 నుంచి 29వరకు వారం రోజుల పాటు విదేశాల నుంచి విమానాలను అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసింది. 65 ఏళ్లు పైబడిన పౌరులు(ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు, వైద్య నిపుణులు మినహా) ఇంటికే పరిమితం(చికిత్సకు తప్పితే) కావాలనే సూచనలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అదే విధంగా పదేళ్లలోపు పిల్లలూ ఇళ్లు కదలొద్దని తెలిపింది. ప్రయివేటు(అత్యవసర సేవలందించేవి […]
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలను తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ నెల 22 నుంచి 29వరకు వారం రోజుల పాటు విదేశాల నుంచి విమానాలను అనుమతించబోమని కేంద్రం స్పష్టం చేసింది. 65 ఏళ్లు పైబడిన పౌరులు(ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులు, వైద్య నిపుణులు మినహా) ఇంటికే పరిమితం(చికిత్సకు తప్పితే) కావాలనే సూచనలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. అదే విధంగా పదేళ్లలోపు పిల్లలూ ఇళ్లు కదలొద్దని తెలిపింది. ప్రయివేటు(అత్యవసర సేవలందించేవి మినహాయించి)రంగంలో వర్క్ ఫ్రమ్ హోం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. విద్యార్థులు, రోగులు, వికలాంగులు మినహా అందరికి రైల్వే, విమానయానంలో రాయితీలను రద్దు చేసింది.
Tags : central, international airlines, cancel, not allowed, remain at home