సింగిల్ అంటూనే మింగిల్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందన్న వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. చెల్లి నిహారికకు ఈ ఏడాది పెళ్లి చేసి.. నెక్స్ట్ తను కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనేది ఆ వార్త సారాంశం. ఈ ఫేక్ న్యూస్ చూసి అవాక్కయిన మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. బావా నీ పెళ్లా ? అంటూ వరుణ్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన వరుణ్… దానికి చాలా […]
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వచ్చే ఏడాది ఉంటుందన్న వార్త సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. చెల్లి నిహారికకు ఈ ఏడాది పెళ్లి చేసి.. నెక్స్ట్ తను కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడనేది ఆ వార్త సారాంశం. ఈ ఫేక్ న్యూస్ చూసి అవాక్కయిన మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. బావా నీ పెళ్లా ? అంటూ వరుణ్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు.
దీనిపై స్పందించిన వరుణ్… దానికి చాలా టైమ్ ఉంది కానీ ‘రానా దగ్గుబాటి, నితిన్’ భలే మోసం చేశారు మనల్ని అన్నారు. ఎప్పటికీ సింగిల్స్ బ్యాచ్‌లోనే ఉంటాం అంటూనే హ్యాండ్ ఇచ్చి.. సింపుల్‌గా సింగిల్స్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు అన్నాడు.
‘దానికి చాలా టైమ్ ఉందికి.. సింగిల్ ఫర్ ఎవర్కు చాలా తేడా ఉంది’ అన్నారు వెన్నెల కిషోర్. సోలో బ్రతుకే సో బెటర్.. సింగిల్స్ థియరీ అంటూ ఏదేదో చెప్పేశాడు.
ఇక ఇండస్ట్రీ యంగ్ హీరోలకు పెద్దక్కలా వ్యవహరించే మంచు లక్ష్మీ ఈ ట్వీట్స్ చూసి.. అసలు మీకేమైంది? అంటూ బెదిరించి సింగిల్స్ ట్వీట్లకు ఫుల్స్టాప్ పడేలా చేసింది.
Enti bava @IAmVarunTej neeku pellanta? 😱😱😱 pic.twitter.com/0jEWbDe5PU
— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 23, 2020