ఇంటర్ విద్యార్థిని అదృశ్యం.. టెన్షల్‌లో కుటుంబ సభ్యులు

దిశ, కంటోన్మెంట్ : ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక ఆదృశ్యమైన ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. పాత బోయిన్‌పల్లి, టీచర్స్ కాలనీకి చెందిన కాసన్న , పార్వతమ్మ భార్యభర్తలు. వీరు ఇద్దరు రోజువారి కూలి పనులు చేసుకుంటూ పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఈ దంపతుల కుమార్తె మమత(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ నెల 16న ఉదయం 6 గంటలకు పార్వతమ్మ పనికి వెళ్లగా, కాసన్న ఇంట్లోనే నిద్రిస్తున్నాడు. ఉదయం […]

Update: 2021-07-17 10:38 GMT
Mamatha
  • whatsapp icon

దిశ, కంటోన్మెంట్ : ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక ఆదృశ్యమైన ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం.. పాత బోయిన్‌పల్లి, టీచర్స్ కాలనీకి చెందిన కాసన్న , పార్వతమ్మ భార్యభర్తలు. వీరు ఇద్దరు రోజువారి కూలి పనులు చేసుకుంటూ పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఈ దంపతుల కుమార్తె మమత(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ నెల 16న ఉదయం 6 గంటలకు పార్వతమ్మ పనికి వెళ్లగా, కాసన్న ఇంట్లోనే నిద్రిస్తున్నాడు.

ఉదయం 7 గంటల ప్రాంతంలో మమత.. తన తల్లికి పనిలో సహాయపడేందుకు వెళ్తుతున్నానని తన తమ్ముడు శివతో చెప్పి వెళ్లింది. అనంతరం 8 గంటలకు నిద్రలేచిన కాసన్న పనికి వెళ్లగా, 11 గంటల ప్రాంతంలో శివ.. తల్లి పార్వతమ్మ వద్దకు వెళ్లగా, అక్కడ మమత కనిపించలేదు. దీంతో, ఆందోళనకు గురైన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వద్ద అరాతీసిన ఫలితం లేకపోవడంతో కాసన్న శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News