10th నుంచి డైరెక్ట్‌గా ఇంటర్‌కు ప్రమోట్ చేయాలి

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నది. దీంతో అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. దీని మూలంగా విద్యార్థులను మళ్లీ ఇబ్బందులు పెట్టకుండా పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి డైరెక్ట్‌గా ఇంటర్మీడియట్‌కు ప్రమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అవసరమైతే నేరుగా ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా విద్యార్థులను ప్రమోట్‌ […]

Update: 2020-03-27 20:54 GMT

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నది. దీంతో అనేక పరీక్షలు వాయిదా పడ్డాయి. దీని మూలంగా విద్యార్థులను మళ్లీ ఇబ్బందులు పెట్టకుండా పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి డైరెక్ట్‌గా ఇంటర్మీడియట్‌కు ప్రమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అవసరమైతే నేరుగా ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు నాగమధుయాదవ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags: Intermediate, promoted, tenth class students, direct, ap

Tags:    

Similar News