విద్యార్థులకు శుభవార్త.. ఇప్పుడే ప్రారంభమైంది

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రారంభమయ్యింది. వాస్తవానికి ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. జిల్లాలో నేటి నుంచి మూల్యాంకనం ప్రారంభించినట్టు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి భానునాయక్ తెలిపారు. గతంలో ఒక్క కేంద్రంలోనే మూల్యాంకనం చేయగా, ప్రస్తుతం మూడు కేంద్రాల్లో చేస్తున్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ జూనియర్ కాలేజీ, లిటిల్ ఫ్లవర్, డాన్ బాస్కో అకాడమీలో మూల్యాంకనం చేస్తున్నారు. కేపీఎం సెంటర్ లో […]

Update: 2020-05-12 00:20 GMT

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రారంభమయ్యింది. వాస్తవానికి ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా, కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. జిల్లాలో నేటి నుంచి మూల్యాంకనం ప్రారంభించినట్టు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి భానునాయక్ తెలిపారు. గతంలో ఒక్క కేంద్రంలోనే మూల్యాంకనం చేయగా, ప్రస్తుతం మూడు కేంద్రాల్లో చేస్తున్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ జూనియర్ కాలేజీ, లిటిల్ ఫ్లవర్, డాన్ బాస్కో అకాడమీలో మూల్యాంకనం చేస్తున్నారు. కేపీఎం సెంటర్ లో ఇంగ్లీష్, సంస్కృతం, లిటిల్ ఫ్లవర్ సెంటరులో మ్యాథ్స్, డాన్ బాస్కో అకాడమీలో సివిక్స్ మూల్యాంకనం చేస్తున్నారు. 15 రోజుల్లో మూల్యాంకనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసినట్టు డీఐఈఓ భాను నాయక్ తెలిపారు.

Tags:    

Similar News