5G నెట్‌వర్క్ అభివృద్ధి కోసం ఇంటెల్‌తో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కొత్త టెక్నాలజీ 5జీ నెట్‌వర్క్ అభివృద్ధి చేసేందుకు ఇంటెల్‌తో దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఒప్పందం చేసుకున్నట్టు బుధవారం వెల్లడించింది. వర్చువలైజ్‌డ్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్(వీఆర్ఏఎన్), ఓ-రాన్ టెక్నాలజీలను పెంచి 5జీ నెట్‌వర్క్ అభివృద్ధికి కృషి చేసేందుకే అమెరికాకు చెందిన ఇంటెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఇంటెల్ సంస్థకు భారత్‌లో ఇది రెండో 5జీ సంబంధిత ఒప్పందం. 5జీ రేడియో, కోర్, క్లౌడ్, ఎడ్జ్, ఏఐ రంగాలతో సహా టెలికాం రంగానికి […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కొత్త టెక్నాలజీ 5జీ నెట్‌వర్క్ అభివృద్ధి చేసేందుకు ఇంటెల్‌తో దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఒప్పందం చేసుకున్నట్టు బుధవారం వెల్లడించింది. వర్చువలైజ్‌డ్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్(వీఆర్ఏఎన్), ఓ-రాన్ టెక్నాలజీలను పెంచి 5జీ నెట్‌వర్క్ అభివృద్ధికి కృషి చేసేందుకే అమెరికాకు చెందిన ఇంటెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఇంటెల్ సంస్థకు భారత్‌లో ఇది రెండో 5జీ సంబంధిత ఒప్పందం. 5జీ రేడియో, కోర్, క్లౌడ్, ఎడ్జ్, ఏఐ రంగాలతో సహా టెలికాం రంగానికి 5జీ అభివృద్ధిలో సహాయం చేసేందుకు ఇటీవల రిలయన్స్ జియోతో కూడా భాగస్వామ్యం చేసుకుంది.
ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో 5జీ వేగవంతం చేయడం కుదురుతుందని, 5జీ నెట్‌వర్క్ వల్ల పరిశ్రమ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్లలో, టెలీ మెడిసిన్, క్లౌడ్ గేమింగ్, టెలీ ఎడ్యుకేషన్, వర్చువల్ రియాలిటీ, డ్రోన్ ఆధారిత వ్యవసాయ మానిటరింగ్ లాంటి వాటిలో కీలక మార్పులు జరుగుతాయని ఎయిర్‌టెల్ అభిప్రాయపడింది. భారత్‌లో ఎయిర్‌టెల్ సంస్థ ప్రధాన నగరాల్లో 5జీ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓ-రాన్ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యులైన ఎయిర్‌టెల్, ఇంటెల్ సంస్థలు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 5జీ అభివృద్ధి కోసం స్థానిక భాగస్వామ్యం ద్వారా ప్రపంచ స్థాయిలో టెలికాం మౌలిక సదుపాయాలను కల్పించేందుకు పనిచేస్తున్నాయి.