ఇకపై ఎల్ఐసీ పనిదినాలు వారంలో ఐదు రోజులే!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఇకపై వారంలో ఐదు రోజులే పనిచేయనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏప్రిల్ 15, 2021 నోటిఫికేషన్ ప్రకారం శనివారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ ఎల్ఐసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి ఎల్ఐసీ కార్యాలయాలన్నీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం […]

Update: 2021-05-06 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఇకపై వారంలో ఐదు రోజులే పనిచేయనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏప్రిల్ 15, 2021 నోటిఫికేషన్ ప్రకారం శనివారాన్ని సెలవు దినంగా ప్రకటిస్తూ ఎల్ఐసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధన ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి ఎల్ఐసీ కార్యాలయాలన్నీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పని చేస్తాయని కంపెనీ వివరించింది. ఈ నేపథ్యంలో పాలసీదారులు, వాటాదారులు సైతం పని దినాల్లో మార్పులను గమనించి తమ కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుందని ఎల్ఐసీ కోరింది.

 

Tags:    

Similar News