కందిలో ఇది వినూత్నం

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఆశా కో పరిశ్రమ యాజమాన్యం వహిస్తున్న మొండి వైఖరికి నిరసనగా శనివారం కార్మికులు బొర్లుతు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు జి. సాయిలు మాట్లాడుతూ కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 20 రోజుల నుండి సమ్మె చేస్తున్న యాజమాన్యం, లేబర్ అధికారులు గాని సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, వెంటనే పరిశ్రమలో అక్రమ లే ఆఫ్ ఎత్తి వేయాలని డిమాండ్ […]

Update: 2020-08-08 04:09 GMT

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఆశా కో పరిశ్రమ యాజమాన్యం వహిస్తున్న మొండి వైఖరికి నిరసనగా శనివారం కార్మికులు బొర్లుతు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు జి. సాయిలు మాట్లాడుతూ కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 20 రోజుల నుండి సమ్మె చేస్తున్న యాజమాన్యం, లేబర్ అధికారులు గాని సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, వెంటనే పరిశ్రమలో అక్రమ లే ఆఫ్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. లేనిచో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నుస్రత్, ప్రభాకర్, నాగరాజ్, శ్రీనివాస్, మార్కండేయ, నిజాముద్దీన్, పాండు, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, వెంకటేష్, షారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Tags:    

Similar News