భారీ బైబ్యాక్ ప్రకటించిన ఇన్ఫోసిస్

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్‌ను బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ నెలలోనే ఈ షేర్ల బైబ్యాక్ కోసం సంస్థ బోర్డు డైరెక్టర్లు ఆమోదం ఇచ్చినప్పటికీ, ఈ నెల 19న సంస్థ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల అనుమతి మంజూరు అయింది. ఈ నెల 25న మొత్తం రూ. 9,200 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను నిర్వహించనున్నట్టు ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బైబ్యాక్ ఆఫర్‌గా ఒక్కో షేర్‌కు గరిష్ఠగా […]

Update: 2021-06-23 09:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ భారీ బైబ్యాక్‌ను బుధవారం ప్రకటించింది. ఏప్రిల్ నెలలోనే ఈ షేర్ల బైబ్యాక్ కోసం సంస్థ బోర్డు డైరెక్టర్లు ఆమోదం ఇచ్చినప్పటికీ, ఈ నెల 19న సంస్థ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల అనుమతి మంజూరు అయింది. ఈ నెల 25న మొత్తం రూ. 9,200 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను నిర్వహించనున్నట్టు ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. బైబ్యాక్ ఆఫర్‌గా ఒక్కో షేర్‌కు గరిష్ఠగా రూ. 1,750కి కొనుగోలు చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. చివరి తేదీ ఈ ఏడాది డిసెంబర్ 24న గడువు ముగుస్తుందని కంపెనీ పేర్కొంది.

మొత్తం 5,25,71,428 ఈక్విటీ షేర్లను ఇన్ఫోసిస్ కొనుగోలు చేయనుంది. ఈ భారీ మొత్తం షేర్ల బైబ్యాక్‌కు కోటక్ మహీంద్రా కేపిటల్ కంపెనీనిని మేనేజర్‌గా నియమించినట్టు ఇన్ఫోసిస్ వెల్లడించింది. జూన్ 19న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బైబ్యాక్ ఆఫర్ ప్రతిపాదనకు అనుకూలంగా 98.83 శాతం ఓట్లు వచ్చాయని కంపెనీ తెలిపింది.

Tags:    

Similar News