ఇన్ఫోసిస్ సీఈవో సలీల్‌కు ప్రోత్సాహకం!
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలోని దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌కు ఆ సంస్థ భారీగా ప్రోత్సాహకాలను ఇచ్చింది. సుమారు రూ. 3.25 కోట్ల విలువైన వాటాలను సలీల్‌కు కేటాయించింది. మొత్తం 2.23 లక్షల షేర్లను సీఈవోకు కేటాయించింది. ప్రస్తుతం సంస్థకున్న రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ నుంచి వాటాలను కేటాయించారు. 2015లో ఇన్సెంటివ్ కాంపన్షేషన్ ప్లాన్‌లో భాగంగా వీటిని ఇచ్చింది. అలాగే సంస్థ సీవోవో ప్రవీణ్ రావ్‌కు కూడా 58,650 రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్‌ల […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలోని దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్‌కు ఆ సంస్థ భారీగా ప్రోత్సాహకాలను ఇచ్చింది. సుమారు రూ. 3.25 కోట్ల విలువైన వాటాలను సలీల్‌కు కేటాయించింది. మొత్తం 2.23 లక్షల షేర్లను సీఈవోకు కేటాయించింది. ప్రస్తుతం సంస్థకున్న రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ నుంచి వాటాలను కేటాయించారు. 2015లో ఇన్సెంటివ్ కాంపన్షేషన్ ప్లాన్‌లో భాగంగా వీటిని ఇచ్చింది. అలాగే సంస్థ సీవోవో ప్రవీణ్ రావ్‌కు కూడా 58,650 రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్‌ల నుంచి వాటాలను కేటాయించింది. దీనికి సంబంధించిన వివరాలను సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది.
ఇన్సెంటీవ్ కాంపన్సేషన్ ప్లాన్‌లో భాగంగా మొత్తం ఐదుగురికి 3,53,270 రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్‌లను కేటాయించడం జరిగింది. ఈ కేటాయింపు కనీసం నాలుగేళ్ల పీరియడ్ ఉంటుంది. విస్తరించిన స్టాక్ కార్యక్రమం ప్రకారం కీలకమైన వ్యక్తులకు 1,69,000 ప్రిఫరెషియల్ స్టాక్ యూనిట్‌లను ఇన్ఫోసిస్ కేటాయించింది. వీరు కాకుండా 411 మందికి 17,76,500 ప్రిఫరెన్షియల్ స్టాక్స్ యూనిట్‌లను సంస్థ కేటాయించింది. పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ కింద సంస్థ పనితీరు ఆధారంగా షేర్లను కేటాయిస్తుంది.