ఇండియాలో విడుదలైన ఇన్ఫినిక్స్ మొబైల్స్
దిశ, వెబ్ డెస్క్ : హాంకాంగ్‌కు చెందిన మొబైల్ కంపెనీ ఇన్పినిక్స్.. హాట్ 9, హాట్ 9 ప్రొ పేరుతో రెండు కొత్త ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. రెండు ఫోన్లలోనూ ఫీచర్లు దాదాపుగా సేమ్ ఉండగా కెమెరాలో మాత్రమే తేడాలున్నాయి. ఇన్ ఫీనిక్స్ హాట్ 9 ప్రోలో బ్యాక్ కెమెరా 48 + 2 + 2 మెగా పిక్సెల్ అందించగా, హాట్ 9 ప్రోలో 13 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ హీలియో […]
దిశ, వెబ్ డెస్క్ :
హాంకాంగ్‌కు చెందిన మొబైల్ కంపెనీ ఇన్పినిక్స్.. హాట్ 9, హాట్ 9 ప్రొ పేరుతో రెండు కొత్త ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. రెండు ఫోన్లలోనూ ఫీచర్లు దాదాపుగా సేమ్ ఉండగా కెమెరాలో మాత్రమే తేడాలున్నాయి. ఇన్ ఫీనిక్స్ హాట్ 9 ప్రోలో బ్యాక్ కెమెరా 48 + 2 + 2 మెగా పిక్సెల్ అందించగా, హాట్ 9 ప్రోలో 13 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. మీడియాటెక్ హీలియో పీ22 ఆక్టాకోర్ ప్రాసెసర్ పై ఈ ఫోన్లు పనిచేయనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. హాట్ 9 ఫోన్ ధర రూ.8,499 కాగా, హాట్ 9 ప్రొ ధరను 9,499గా నిర్ణయించారు. రెండు ఫోన్లూ కూడా 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లలోనే లభ్యం కానున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా అందించారు. డ్యుయల్ సిమ్ ఆప్షన్ తోపాటు, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఇందులో ఉండటం విశేషం. బ్లూ, వయోలెట్ రంగుల్లో మాత్రమే ఈ ఫోన్లను తీసుకొచ్చారు.
ఇన్ఫినిక్స్ ఫీచర్లు
ఇన్పినిక్స్ హాట్ 9:
ప్రాసెసర్ : ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22
సిమ్ స్లాట్ : డ్యుయల్ సిమ్
డిస్‌ప్లే: 6.60 అంగుళాలు
ప్రాసెసర్: మీడియా టెక్ హీలియో పీ22
హాట్ 9 కెమెరా:13+2+2+ మెగా పిక్సల్
హాట్ 9 ప్రో కెమెరా : 48+2+2 మెగా పిక్సల్
ఫ్రంట్ కెమెరా : 8 మెగా పిక్సల్
ర్యామ్: 4జీబీ
స్టోరేజ్: 64జీబీ
బ్యాటరీ: 5000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
ఇన్ఫినిక్స్ హాట్ 9 ఫస్ట్ సేల్.. ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుండగా,. హాట్ 9 ప్రొ ఫోన్ ను జూన్ 5 నుంచి విక్రయిస్తారు.