ఇండోనేషియన్ల సహాయకునికి కరోనా నెగిటివ్
దిశ, కరీంనగర్: ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులకు సహాయకుడిగా వ్యవహరించిన వ్యక్తికి గతంలో కరోనా పాజిటివ్ రాగా, చికిత్స అనంతరం తాజాగా చేసిన టెస్ట్‌లో నెగిటివ్ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సుజాత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయినప్పటికీ అతన్నిమరో 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంచనున్నట్టు వారు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో కరోనా నివారణకు ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) విభాగం తమవంతు సాయంగా ముందుకు వచ్చిందని జిల్లా వైద్యాధికారి చెప్పారు. […]
దిశ, కరీంనగర్: ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులకు సహాయకుడిగా వ్యవహరించిన వ్యక్తికి గతంలో కరోనా పాజిటివ్ రాగా, చికిత్స అనంతరం తాజాగా చేసిన టెస్ట్‌లో నెగిటివ్ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సుజాత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయినప్పటికీ అతన్నిమరో 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉంచనున్నట్టు వారు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో కరోనా నివారణకు ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) విభాగం తమవంతు సాయంగా ముందుకు వచ్చిందని జిల్లా వైద్యాధికారి చెప్పారు. నగరంలోని శివానంద హాస్పిటల్ తరఫున డాక్టర్ ఎడవెల్లి విజయేందర్ రెడ్డి 2అంబులెన్స్‌లు, స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మరో అంబులెన్స్‌ను కరోనా నివారణకు ఉపయోగించుకోవడానికి అందజేస్తామన్నారు. క్వారంటైన్ సెంటర్ల వద్ద వీటిని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా సమకూర్చినట్టు డీఎంహెచ్‌వో వెల్లడించారు.
Tags: corona negative,indonesian helper, lockdown, karimnagar