ఇండిగో తొలి త్రైమాసికం నష్టాలు రూ. 2,844 కోట్లు

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 2,844.3 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇది రూ. 1,203.1 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 91.9 శాతం క్షీణించి రూ. 766.7 కోట్లకు చేరుకుంది. కొవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి త్రైమాసికంలో విమానయాన సంస్థల కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థిక ఫలితాలు భారీగా ప్రభావితమైనట్టు కంపెనీ […]

Update: 2020-07-29 06:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 2,844.3 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇది రూ. 1,203.1 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 91.9 శాతం క్షీణించి రూ. 766.7 కోట్లకు చేరుకుంది. కొవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలి త్రైమాసికంలో విమానయాన సంస్థల కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థిక ఫలితాలు భారీగా ప్రభావితమైనట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. విమానయాన పరిశ్రమ కరోనా సంక్షోభంతో మనుగడ కోసం ప్రయత్నిస్తోంది.

తాము ముఖ్యంగా నగదు నిల్వలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని కంపెనీ పేర్కొంది. అయితే, సంక్షోభం నుంచి గట్టెక్కడానికి సరైన ప్రణాళికతో మళ్లీ పుంజుకుంటామని ఇండిగో సీఈవో రోనోజొయ్ దత్తా తెలిపారు. ఇక, మొత్తం నగదు నిల్వలు రూ. 18,449.8 కోట్లు ఉండగా, ఇందులో రూ. 7,527.6 కోట్లు నగదు నిల్వలు కాగా, రూ. 10,922.2 కోట్లు పెట్టుబడుల రూపంలో ఉన్న నగదని కంపెనీ తెలిపింది. సంక్షోభం నుంచి నిలదొక్కుకుని కరోనాకు ముందున్న సాధారణ ప్రయాణీకుల స్థాయి 2024 నాటికి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెప్పినందున నగదు నిర్వహణ చాలా ముఖ్యమని భావిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News