గుడ్ న్యూస్.. ఇండియాలో త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్

న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో మరో స్వదేశీ కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. దేశీయ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడీలా ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు తమ కంపెనీ అభివృద్ధి చేసిన ‘జైకోవ్-డీ’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు గురువారం దరఖాస్తు చేసుకుంది. కాగా జైకోవ్-డీ అనేది ప్రపంచంలోనె మొట్టమొదటి ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్ అనీ కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఈ వ్యాక్సిన్ […]

Update: 2021-07-01 00:48 GMT

న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో మరో స్వదేశీ కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. దేశీయ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడీలా ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు తమ కంపెనీ అభివృద్ధి చేసిన ‘జైకోవ్-డీ’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతులు కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు గురువారం దరఖాస్తు చేసుకుంది. కాగా జైకోవ్-డీ అనేది ప్రపంచంలోనె మొట్టమొదటి ప్లాస్మిడ్ డీఎన్ఏ వ్యాక్సిన్ అనీ కంపెనీ తెలిపింది.

అంతే కాకుండా ఈ వ్యాక్సిన్ నీడిల్ ఫ్రీ అని పిల్లలకు సురక్షితమైనదని దరఖాస్తులో కంపెనీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా థర్డ్ ఫేజ్ ట్రయల్స్‌లో భాగంగా 28వేల మందిపై ప్రయోగాలు చేశామనీ తెలిపింది. అంతేకాకుండా ఈ ట్రయల్స్‌లోనే 12 నుంచి 18 ఏండ్లు ఉన్న వేయి మందిపై కూడా ప్రయోగాలు చేశామని కంపెనీ చెప్పింది. ఈ వ్యాక్సిన్ సింప్టమెటిక్ కొవిడ్ కేసులపై 66.6శాతం సమర్థవంతంగా, మాడరేట్ కరోనాపై 100 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొంది. అనుమతులు రాగానే ఏడాదికి 120 మిలియన్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది.

 

Tags:    

Similar News