ఐక్యరాజ్యసమితి నుంచి వీడ్కోలు తీసుకున్న అక్బరుద్దీన్
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం రిటైర్ అయ్యారు. 2016 నుంచి యూఎన్‌లో భారత ప్రతినిధిగా ఉన్న అక్బరుద్దీన్, అక్కడ భారత బాణీని వినిపించడంలో తనదైన శైలిలో వ్యవహరించారు. పాకిస్తాన్ పలు సందర్భాల్లో భారత్‌పై చేసిన ఆరోపణలను ఐక్యరాజ్య సమితిలో తిప్పికొట్టడంలో అక్బరుద్దీన్ సఫలీకృతులయ్యారు. ఆయన వాడి వేడి మాటలతో పాక్ ప్రతినిధుల నోట నుంచి మాటరాకుండా చేసే వారు. 1985 బ్యాచ్ ఇండియన్ ఫారన్ సర్వీసెస్ అధికారి అయిన అక్బరుద్దీన్ […]
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ గురువారం రిటైర్ అయ్యారు. 2016 నుంచి యూఎన్‌లో భారత ప్రతినిధిగా ఉన్న అక్బరుద్దీన్, అక్కడ భారత బాణీని వినిపించడంలో తనదైన శైలిలో వ్యవహరించారు. పాకిస్తాన్ పలు సందర్భాల్లో భారత్‌పై చేసిన ఆరోపణలను ఐక్యరాజ్య సమితిలో తిప్పికొట్టడంలో అక్బరుద్దీన్ సఫలీకృతులయ్యారు. ఆయన వాడి వేడి మాటలతో పాక్ ప్రతినిధుల నోట నుంచి మాటరాకుండా చేసే వారు. 1985 బ్యాచ్ ఇండియన్ ఫారన్ సర్వీసెస్ అధికారి అయిన అక్బరుద్దీన్ రిటైర్ కావడంతో ఆయన స్థానంలో టీఎస్ తిరుమూర్తిని శాశ్వత ప్రతినిధిగా భారత ప్రభుత్వం నియమించింది. తిరుమూర్తి ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పని చేస్తున్నారు. కాగా, ఐక్యరాజ్య సమితి నుంచి వీడ్కోలు తీసుకునే ముందు అక్బరుద్దీన్ యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు వీడియో కాల్ చేశారు. ‘కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం అందరూ భౌతిక దూరం పాటిస్తున్నారని.. ఈ సమయంలో షేక్ హ్యాడ్స్ ఇవ్వడం గానీ, భుజాలు తట్టడం కానీ చేయకూడదు. అయితే భారతీయ సాంప్రదాయం అయిన నమస్తేని మాత్రం చెప్పవచ్చు. కాబట్టి నా విధుల నుంచి తప్పుకునే ముందు మీకు నమస్తే చెబుతున్నాను’ అని అక్బరుద్దీన్ వీడ్కోలు పలికారు. దీనికి గుటెరస్ కూడా చిరునవ్వుతో నమస్తే అని బదులిచ్చారు.
Tags : Syed Akbaruddin, Retired, Permanent Representative, United Nations, Namaste, Coronavirus, Antonio Guterres