కరోనా కఠిన ఆంక్షలు.. కనిష్ఠానికి చేరిన సేవల రంగ కార్యకలాపాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అనేక ప్రాంతాల్లో కొవిడ్ నియంత్రణకు విధించిన కఠిన ఆంక్షలు డిమాండ్‌ను దెబ్బతీయడంతో జూన్ నెలలో సేవల రంగంలోని కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో సమీక్షించిన నెలలో సేవల రంగ కార్యకలాపాలు 11 నెలల కనిష్ఠానికి క్షీణించాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీంఐ) జూన్‌లో 41.2గా నమోదైనట్టు సోమవారం విడుదలైన నివేదిక తెలిపింది. సాధారణంగా పీఎంఐ సూచీ 50కి పైన నమోదైతే వృద్ధిని సూచిస్తుంది. 50కి దిగువన నమోదైతే క్షీణతగా భావిస్తారు. […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని అనేక ప్రాంతాల్లో కొవిడ్ నియంత్రణకు విధించిన కఠిన ఆంక్షలు డిమాండ్‌ను దెబ్బతీయడంతో జూన్ నెలలో సేవల రంగంలోని కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో సమీక్షించిన నెలలో సేవల రంగ కార్యకలాపాలు 11 నెలల కనిష్ఠానికి క్షీణించాయి. ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీంఐ) జూన్‌లో 41.2గా నమోదైనట్టు సోమవారం విడుదలైన నివేదిక తెలిపింది. సాధారణంగా పీఎంఐ సూచీ 50కి పైన నమోదైతే వృద్ధిని సూచిస్తుంది. 50కి దిగువన నమోదైతే క్షీణతగా భావిస్తారు.
అయితే, పీఎంఐ 50 కంటే తక్కువ నమోదవడం వరుసగా రెండో నెల కావడం గమనార్హం. మే నెలలో పీఎంఐ 46.4గా వద్ద ఉంది. పరిశ్రమలు, ఉత్పత్తి తగ్గిపోవడం, ఉద్యోగాలు వేగంగా తగ్గిపోయాయని, అయితే సెకెండ్ వేవ్ వల్ల సేవల రంగం దెబ్బతింటుందని ఇదివరకే అంచనా వేశామని ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రతినిధి ఎకనమిక్ అసోసియేట్ డైరెక్టర్ పొల్యానా డి లిమా చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయని ఆమె తెలిపారు. అదే విధంగా నిర్వహణ, పెట్టుబడి వ్యయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం కంటే అధికంగా ఉండోచ్చని నివేదిక అభిప్రాయపడింది. గతవారం తయారీ కార్యకలాపాలు మెరుగ్గా ఉన్నట్టు వెల్లడిన సంగతి తెలిసిందే.