హార్లే-డేవిడ్‌సన్ బైకులు అమ్మనున్న హీరో!

దిశ, వెబ్‌డేస్క్: ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్ గతేడాది కరోనా ప్రభావంతో భారత్‌లో కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఈ సంస్థ కంపెనీల బైకులను విక్రయించేందుకు దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ వాహనాలను విక్రయించడానికి హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ప్రత్యేకంగా వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు బుధవారం తెలిపింది. దేశీయంగా ఉన్న హార్లే డేవిడ్‌సన్ వాహన […]

Update: 2021-02-03 07:49 GMT

దిశ, వెబ్‌డేస్క్: ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ హార్లే డేవిడ్‌సన్ గతేడాది కరోనా ప్రభావంతో భారత్‌లో కార్యకలాపాలు నిలిపేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఈ సంస్థ కంపెనీల బైకులను విక్రయించేందుకు దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లో హార్లే డేవిడ్‌సన్ వాహనాలను విక్రయించడానికి హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ప్రత్యేకంగా వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు బుధవారం తెలిపింది. దేశీయంగా ఉన్న హార్లే డేవిడ్‌సన్ వాహన ప్రియులకు సౌకర్యవంతంగా సేవలను అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News