కరోనా పూర్వస్థాయికి చేరుకున్న ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు కరోనా పూర్వస్థాయికి చేరుకోవడమే కాకుండా, 2020 డిసెంబర్‌లో రూ. 8,806 కోట్ల గరిష్ఠానికి చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. వీటిలో అత్యధికంగా రూ. 3,061 విలువైన ఎగుమతులతో మొబైల్‌ఫోన్‌ల విభాగం అగ్రస్థానంలో ఉంది. ఇది మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 35 శాతం వాటా. అయితే, కరోనాకు ముందు మొబైల్‌ఫోన్ విభాగం ఎగుమతులు రూ. 3,254 కోట్లుగా ఉన్నాయి. ఇక, 2020 ఏడాదిలో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు […]

Update: 2021-03-02 11:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు కరోనా పూర్వస్థాయికి చేరుకోవడమే కాకుండా, 2020 డిసెంబర్‌లో రూ. 8,806 కోట్ల గరిష్ఠానికి చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. వీటిలో అత్యధికంగా రూ. 3,061 విలువైన ఎగుమతులతో మొబైల్‌ఫోన్‌ల విభాగం అగ్రస్థానంలో ఉంది. ఇది మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో 35 శాతం వాటా. అయితే, కరోనాకు ముందు మొబైల్‌ఫోన్ విభాగం ఎగుమతులు రూ. 3,254 కోట్లుగా ఉన్నాయి.

ఇక, 2020 ఏడాదిలో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 4.32 శాతం క్షీణించి రూ. 73,132 కోట్లకు చేరుకున్నాయి. దిగుమతులు రూ. 3.5 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువుల జాబితాలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఎలక్ట్రానిక్స్ వస్తువులైన కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ ఇన్వర్టర్లు, బ్యాటరీ ఛార్జర్లు, స్కానర్లు, ప్రింటర్లు, స్పీకర్లు, టీవీలు, మైక్రో ప్రాసెసర్‌లు ఉన్నాయి. కాగా, నాలుగేళ్ల కాలానికి మొత్తం రూ. 7,350 కోట్లను ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం ద్వారా ఎలక్ట్రానిక్స్ విభాగానికి అందజేయాలని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలవనుంది.

Tags:    

Similar News