ఉద్యోగాలపై విశ్వాసం కోల్పోతున్న మహిళలు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ మహమ్మారి కారణంగా జాబ్ మార్కెట్లో మహిళా ఉద్యోగులు మిగిలిన వారికంటే ఎక్కువగా నష్టపోయారని ప్రముఖ కన్సల్టెన్సీ ఏజెన్సీ లింక్‌డ్ఇన్ మంగళవారం తన నివేదికలో వెల్లడించింది. పురుషులతో పోలిస్తే ఉద్యోగ లభ్యత గురించి మహిళలు రెండు రెట్లు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని, ఉద్యోగ విశ్వాసం విషయంలో నాలుగు రెట్లు వెనకబడి ఉన్నారని లింక్‌డ్ఇన్ నివేదిక తెలిపింది. నిపుణులు ప్రకారం.. ఆర్థిక మాంద్యం, ఆదాయ నష్టం విషయంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ సెకెండ్ వేవ్ మహమ్మారి కారణంగా జాబ్ మార్కెట్లో మహిళా ఉద్యోగులు మిగిలిన వారికంటే ఎక్కువగా నష్టపోయారని ప్రముఖ కన్సల్టెన్సీ ఏజెన్సీ లింక్‌డ్ఇన్ మంగళవారం తన నివేదికలో వెల్లడించింది. పురుషులతో పోలిస్తే ఉద్యోగ లభ్యత గురించి మహిళలు రెండు రెట్లు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని, ఉద్యోగ విశ్వాసం విషయంలో నాలుగు రెట్లు వెనకబడి ఉన్నారని లింక్‌డ్ఇన్ నివేదిక తెలిపింది. నిపుణులు ప్రకారం.. ఆర్థిక మాంద్యం, ఆదాయ నష్టం విషయంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ప్రభావితం అయ్యారు.
సెకెండ్ వేవ్ నేపథ్యంలో ముఖ్యంగా మహిళా ఉద్యోగులు జాబ్ మార్కెట్‌లో ఎక్కువ ఉపాధి నష్టాన్ని చూశారని చెప్పారు. ఉద్యోగ విశ్వాసం పురుషుల కంటే నాలుగు రెట్లు తక్కువ కావడంతో పాటు ఈ ప్రతికూల ప్రభావం మహిళల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసిందన్నారు. మహిళల్లో నలుగురిలో ఒకరు పెరుగుతున్న ఖర్చులు, అప్పుల గురించి ఆందోళన చెందుతున్నారని తేలింది. ఇదే రకమైన ఆందోళన పురుషుల్లో పదిమందిలో ఒకరికి మాత్రమే ఉంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్, డిజైన్, మీడియా, కమ్యూనికేషన్ లాంటి క్రియేటివ్ పరిశ్రమలో ఎక్కువమందికి ఉద్యోగం పట్ల విశ్వాసం సన్నగిల్లిందని తెలుస్తోంది. అయితే, సాఫ్ట్‌వేర్, ఐటీ, హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ నిపుణులు వంటి మహిళా ఉద్యోగులు భవిష్యత్తులో వారి ఉద్యోగంపై నమ్మకంతో ఉన్నారు.