స్టార్టప్‌లలో కొనసాగుతున్న పెట్టుబడుల జోరు

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టార్టప్ కంపెనీలు నిధుల సమీకరణలో జోరును కొనసాగిస్తున్నాయి. 2020లో గణనీయంగా నిధులు సేకరించిన తర్వాత 2021లోనూ ఇదే ధోరణి కొనసాగుతున్నట్టు పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో భారతీయ స్టార్టప్ కంపెనీలు వెంచర్ కేపిటల్ నిధుల రూపంలో అత్యధికంగా 16.9 బిలియన్ డాలర్ల(రూ. 1.25 లక్షల కోట్ల)ను సాధించాయని ప్రముఖ గణాంకాల పరిశోధనా సంస్థ గ్లోబల్ డేటా శుక్రవారం వెల్లడించింది. ఆసియా పసిఫిక్ దేశాల్లో చైనా తర్వాత భారత్‌దే తర్వాతి స్థానం కావడం […]

Update: 2021-08-20 06:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టార్టప్ కంపెనీలు నిధుల సమీకరణలో జోరును కొనసాగిస్తున్నాయి. 2020లో గణనీయంగా నిధులు సేకరించిన తర్వాత 2021లోనూ ఇదే ధోరణి కొనసాగుతున్నట్టు పరిశోధనా సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో భారతీయ స్టార్టప్ కంపెనీలు వెంచర్ కేపిటల్ నిధుల రూపంలో అత్యధికంగా 16.9 బిలియన్ డాలర్ల(రూ. 1.25 లక్షల కోట్ల)ను సాధించాయని ప్రముఖ గణాంకాల పరిశోధనా సంస్థ గ్లోబల్ డేటా శుక్రవారం వెల్లడించింది. ఆసియా పసిఫిక్ దేశాల్లో చైనా తర్వాత భారత్‌దే తర్వాతి స్థానం కావడం విశేషం. ‘కొవిడ్ మహమ్మారి మూడో వేవ్, నెమ్మదిగా ఉన్నా ఆర్థిక పునరుద్ధరణ వంటి పరిణామాలు ఉన్నప్పటికీ వెంచర్ కేపిటల్ పెట్టుబడిదారులు దేశీయ స్టార్టప్‌లపై విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ ఏడాది జనవరి-జూలై మధ్య కాలంలో చైనా తర్వాత భారత్ ఎక్కువ వెంచర్ కేపిటల్ నిధులను పొందాయని గ్లోబల్ డాటా తెలిపింది. ఈ సంస్థ గణాంకాల ప్రకారం.. జనవరి-జూలై మధ్య భారత్‌లో మొత్తం 828 వెంచర్ కేపిటల్ నిధుల ఒప్పందాల ప్రకటనలు వెలువడ్డాయి. వీటి విలువ రూ. 1.25 లక్షల కోట్లు. వీటిలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా 26.7 వేల కోట్లు, షేర్‌చాట్ ద్వారా 3,700 కోట్లు, జొమాటో మూలధన సేకరణ ద్వారా రూ. 3,650 కోట్లు, బైజూస్ ద్వారా రూ. 3,400 కోట్ల వరకు నిధులొచ్చాయి. ‘అంతకుముందు నెలతో పోలిస్తే జూలైలో వెంచర్ కేపిటల్ నిధుల విలువలో ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాలు క్షీణించాయి. ఇదే సమయంలో ఈ నిధులను రాబట్టడంలో భారత్ వృద్ధి కొనసాగించిందని’ గ్లోబల్ డేటా ప్రధాన విశ్లేషకులు యారోజ్యోతి బోస్ అన్నారు. పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వినియోగం, మొబైల్ ఇంటర్నెర్ ద్వారా భారత్ డిజిటల్ ఆర్థికవ్యవస్థగా మారుతోంది. దీంతో టెక్ స్టార్టప్ కంపెనీలు ఎక్కువగా ప్రయోజనాలను పొందుతున్నాయని గ్లోబల్ డేటా వెల్లడించింది.

Tags:    

Similar News