అక్రిడిటేషన్ల జీవోపై ప్రెస్ కౌన్సిల్ విచారణ
దిశ, ఏపీబ్యూరో : రాష్ట్ర, జిల్లాస్థాయి మీడియా ప్రతినిధుల అక్రిడిటేషన్ల నియమ, నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని లోపాలను భారత ప్రెస్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది. ముఖ్యంగా రాష్ట్ర మీడియా సమన్వయ కమిటీలో గుర్తింపు పొందిన ప్రధాన స్రవంతి మీడియా, ప్రెస్ కౌన్సిల్ సభ్యుల ప్రాతినిధ్యానికి సంబంధించి గత నెల 8న విడుదల చేసిన ఈ జీవోలో పేర్కొన్న నిబంధనలు తమ మోడల్ అక్రిడిటేషన్ మార్గదర్శకాలకు […]
దిశ, ఏపీబ్యూరో : రాష్ట్ర, జిల్లాస్థాయి మీడియా ప్రతినిధుల అక్రిడిటేషన్ల నియమ, నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని లోపాలను భారత ప్రెస్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ముఖ్యంగా రాష్ట్ర మీడియా సమన్వయ కమిటీలో గుర్తింపు పొందిన ప్రధాన స్రవంతి మీడియా, ప్రెస్ కౌన్సిల్ సభ్యుల ప్రాతినిధ్యానికి సంబంధించి గత నెల 8న విడుదల చేసిన ఈ జీవోలో పేర్కొన్న నిబంధనలు తమ మోడల్ అక్రిడిటేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని పేర్కొంది. జీవోలోని సవరణలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ నోటీసు జారీ చేయాలని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.