ద్రవిడ్ పాకిస్తాన్ క్రికెటర్‌కు సహాయం చేశాడా?

దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ వాల్ ద్రవిడ్ గురించి రెండు రోజుల నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఓ పాకిస్తాన్ క్రికెటర్‌కు సలహాలు ఇచ్చి కెరీర్ బాగు చేశాడనేదే ఆ వార్త సారాంశం. దీంతో భారత క్రికెట్ జట్టు అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదంపై ఆనాటి క్రికెటర్ రషీద్ లతీఫ్ స్పందించాడు. రాహుల్ ద్రావిడ్ చాలా మంచి క్రికెటర్ అని, తనకు తెలిసిన క్రికెటింగ్ స్కిల్స్‌తో […]

Update: 2020-05-30 11:08 GMT

దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ వాల్ ద్రవిడ్ గురించి రెండు రోజుల నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఓ పాకిస్తాన్ క్రికెటర్‌కు సలహాలు ఇచ్చి కెరీర్ బాగు చేశాడనేదే ఆ వార్త సారాంశం. దీంతో భారత క్రికెట్ జట్టు అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదంపై ఆనాటి క్రికెటర్ రషీద్ లతీఫ్ స్పందించాడు. రాహుల్ ద్రావిడ్ చాలా మంచి క్రికెటర్ అని, తనకు తెలిసిన క్రికెటింగ్ స్కిల్స్‌తో భారత జట్టు అండర్-19, ఇండియా-ఏ జట్లను గొప్పగా మలిచాడని చెప్పాడు. పాకిస్తాన్ క్రికెటర్ యూనిస్ ఖాన్ ఎదుగుదలకు ద్రవిడే కారణమని చెప్పాడు. అతడికి తెలిసిన విద్యను ప్రతి క్రికెటర్‌కు పంచుతాడని, అతను ఏ దేశానికి చెందినవాడు అనేది పట్టించుకోడు అన్నాడు. యూనిస్ ఖాన్ మంచి క్రికెటర్‌గా మారడానికి కారణం ద్రవిడే అని స్పష్టం చేశాడు.

Tags:    

Similar News