విదేశాల్లో పెరిగిన భారతీయ కంపెనీల పెట్టుబడులు..

దిశ, వెబ్‌డెస్క్ : భారత పారిశ్రామిక దిగ్గజాలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుత ఏడాదిలో దేశీయంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ మొదటి ఎనిమిది నెలల్లో దేశీయ కంపెనీలు 12.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను విదేశాల్లో పెట్టాయి. గత కొన్నేళ్లలో ఇవి స్థిరమైన విదేశీ పెట్టుబడులని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీట్టిన ఈ పెట్టుబడులు 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా రెండంకెల పెట్టుబడులను పెట్టాయని కేర్ రేటింగ్స్ పేర్కొంది. ఈ […]

Update: 2020-12-25 07:35 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారత పారిశ్రామిక దిగ్గజాలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ప్రస్తుత ఏడాదిలో దేశీయంగా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ మొదటి ఎనిమిది నెలల్లో దేశీయ కంపెనీలు 12.25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను విదేశాల్లో పెట్టాయి. గత కొన్నేళ్లలో ఇవి స్థిరమైన విదేశీ పెట్టుబడులని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీట్టిన ఈ పెట్టుబడులు 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా రెండంకెల పెట్టుబడులను పెట్టాయని కేర్ రేటింగ్స్ పేర్కొంది. ఈ ఏడాది దేశీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టిన దేశాల్లో సింగపూర్, అమెరికా, నెదర్లాండ్స్, మారిషస్ దేశాలు ఉండగా, ఈ దేశాల్లో 70 శాతం పెట్టుబడులు నమోదయ్యాయి. అలాగే, పెట్టుబడులు పెట్టిన జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, హల్దియా పెట్రోకెమికల్స్ కంపెనీలున్నాయి. ఎక్కువ శాతం కంపెనీలు ముఖ్యంగా బీమా, ఆర్థిక, వ్యాపార సేవలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News