20 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. రూ. 73 వేల కోట్లు వసూల్

దిశ, వెబ్‌డెస్క్: పెట్టుబడిదారుల సెంటిమెంట్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో పబ్లిష్ ఇనిషియల్ ఆఫరింగ్(ఐపీఓ)లకు భారీగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ఐపీఓల ద్వారా కంపెనీలు 9.7 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 73 వేల కోట్ల) వసూలు చేశాయి. ఇది రెండు దశాబ్దాలలో ఎన్నడూ నమోదుకాని రికార్డు అని మార్కెట్లు చెబుతున్నాయి. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈవై ప్రకారం.. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య మొత్తం 72 ఐపీలు స్టాక్ మార్కెట్లలోకి […]

Update: 2021-10-10 05:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెట్టుబడిదారుల సెంటిమెంట్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో పబ్లిష్ ఇనిషియల్ ఆఫరింగ్(ఐపీఓ)లకు భారీగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ఐపీఓల ద్వారా కంపెనీలు 9.7 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 73 వేల కోట్ల) వసూలు చేశాయి. ఇది రెండు దశాబ్దాలలో ఎన్నడూ నమోదుకాని రికార్డు అని మార్కెట్లు చెబుతున్నాయి. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈవై ప్రకారం.. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య మొత్తం 72 ఐపీలు స్టాక్ మార్కెట్లలోకి వచ్చాయి. ఈ కంపెనీలు మొత్తం రూ. 73 వేల కోట్ల నిధులను సమీకరించాయి. ఇది 20 ఏళ్ల రికార్డు. అలాగే, కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో ఎక్కువ సంఖ్యలో ఐపీఓ మార్కెట్లకు వచ్చాయని ఈవై పేర్కొంది. ఇదివరకు 2018లో మొత్తం 130 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. 2021లో ఇప్పటికే 72 కంపెనీలు ఐపీఓలను పూర్తి చేయడం, రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు సిద్ధంగా ఉండటంతో అప్పటి రికార్డును తిరగరాసే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా కేవలం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మాత్రమే మొత్తం 31 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. ఈ కంపెనీలు మొత్తం రూ. 37 వేల కోట్లను వసూలు చేశాయి. 8 రంగాలకు చెందిన కంపెనీలు ఈ ఐపీఓల జాబితాలో ఉండగా, ఒక్క టెక్ రంగం నుంచే ఐదు కంపెనీలున్నాయి. మొత్తం ఐపీఓల్లో జొమాటో, కెమ్ ప్లాస్, నువాకో విస్టాస్‌లు భారీ ఐపీఓలుగా నిలిచాయి. గత కొంతకాలంగా మార్కెట్లు సైతం ఆల్‌టైమ్ హై స్థాయిలో ర్యాలీ చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఐపీఓలు నమోదయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News