సంగీత విద్వాంసుడు ఉస్తాద్ గులాం ముస్తాఫాఖాన్ ఇకలేరు
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ గులాం ముస్తాఫాఖాన్ (89) కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1931 మార్చి 3న జన్మించిన ఉత్తరప్రదేశ్‌లోని బదాయున్‌లో ముస్తాఫాఖాన్ జన్మించారు. 2018లో పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. 2006లో పద్మభూషణ్, 1991లో పద్మ శ్రీ, 2003 సంవత్సరంలో సంగీత నాటక అవార్డును పొందారు. ముస్తాఫాఖాన్ మృతిపట్ల ఏఆర్ రెహమాన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.