సాయ్.. ఇది ఆర్మీ సెక్యూర్ యాప్
దిశ, వెబ్‌డెస్క్ : మన దేశాన్ని ఉగ్రమూకల నుంచి, ఇతరత్రా శత్రుదాడుల నుంచి కాపాడేది ఆర్మీనే. అలాంటి ఆర్మీకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ లీకైనా.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే సైనికుల కోసం ప్రత్యేకంగా ఒక మెసేజింగ్ యాప్‌ను అభివృద్ధి చేసింది ఇండియన్ ఆర్మీ. సమాచారాన్ని ఇతరులు యాక్సెస్ చేయడానికి సాధ్యం కాని ‘సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్ (SAI)’ మెసేజింగ్ అప్లికేషన్‌ను సొంతంగా అభివృద్ధి చేసింది. ఇటీవలే లాంచ్ అయిన […]
దిశ, వెబ్‌డెస్క్ :
మన దేశాన్ని ఉగ్రమూకల నుంచి, ఇతరత్రా శత్రుదాడుల నుంచి కాపాడేది ఆర్మీనే. అలాంటి ఆర్మీకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ లీకైనా.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే సైనికుల కోసం ప్రత్యేకంగా ఒక మెసేజింగ్ యాప్‌ను అభివృద్ధి చేసింది ఇండియన్ ఆర్మీ. సమాచారాన్ని ఇతరులు యాక్సెస్ చేయడానికి సాధ్యం కాని ‘సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్ (SAI)’ మెసేజింగ్ అప్లికేషన్‌ను సొంతంగా అభివృద్ధి చేసింది. ఇటీవలే లాంచ్ అయిన ఈ యాప్ వివరాలు.
ఇతర దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎప్పుడూ తమ శత్రుదేశాల సమాచారాన్ని తెలుసుకునేందుకు కాచుకుని ఉంటాయి. దాంతో ఓ చిన్న క్లూ దొరికిన చాలు.. మొత్తం ఇన్ఫర్మేషన్ శత్రువులకు లీకై పోతుంది. అందుకే దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ట్రేస్ చేసేందుకు వీలు లేకుండా, పటిష్టమైన భద్రత ఉండేలా సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్ యాప్‌ను రూపొందించారు. ఎండ్ టూ ఎండ్ సెక్యూర్ వాయిస్, టెక్ట్స్, వీడియో కాలింగ్ సర్వీస్‌లు దీని సొంతం. ఈ సాయ్ యాప్ కూడా.. ప్రముఖ మెసేజింగ్ యాప్స్ వాట్సాప్, టెలిగ్రామ్, సంవాద్, జిమ్స్ లాంటివే. సైన్యానికి చెందిన ప్రత్యేక అంతర్గత సర్వర్లు, కోడింగ్ దీనికి సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తాయి. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్- సెర్ట్ ( CERT), ఆర్మీ సైబర్ గ్రూప్ సంస్థలు ఈ ‘ఎస్‌ఏఐ’ యాప్ పనితీరును పరిశీలించాయి.
ఇది ఆండ్రాయిడ్ యాప్. త్వరలోనే ఐవోఎస్‌లోనూ అందుబాటులోకి వస్తుంది. ఆర్మీ సర్వీస్ విభాగంలో సురక్షితంగా, హ్యాకింగ్‌కు అవకాశం లేకుండా మెస్సేజ్‌లను పంపవచ్చు. సాయ్‌ను రాజస్థాన్‌లోని సిగ్నల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సాయి శంకర్ రూపొందించాడు. అనంతరం దీన్ని మిలటరీ గ్రేడ్ ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు.
ఆర్మీ అధికారిక పనుల కోసం వాట్సాప్ యాప్‌ను వాడకూడదని గత ఏడాది ఆర్మీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.