కరోనా నియంత్రణకు రంగంలోకి ఆర్మీ
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఏ మారుమూల ఏ ఆపద వచ్చినా అక్కడ ఇండియన్ ఆర్మీ ప్రత్యక్షమవుతుంది. ఏ విపత్తు ముంచుకొచ్చినా ప్రాణాలను అడ్డం పెట్టి మరీ ప్రజలను కాపాడుతుంది. అవి ప్రకృతి విపత్తులు అయినా, కరోనా మహమ్మారి అయినా… మేమున్నామంటూ ఆర్మీ ఎప్పుడూ జనం మధ్యకు వచ్చి జనంతో మమేకమవడానికి సిద్ధంగా ఉంటుంది. దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ అంతు చూసేందుకు ఆర్మీ రంగంలోకి దూకింది. కరోనా వైరస్ ప్రభావం […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఏ మారుమూల ఏ ఆపద వచ్చినా అక్కడ ఇండియన్ ఆర్మీ ప్రత్యక్షమవుతుంది. ఏ విపత్తు ముంచుకొచ్చినా ప్రాణాలను అడ్డం పెట్టి మరీ ప్రజలను కాపాడుతుంది. అవి ప్రకృతి విపత్తులు అయినా, కరోనా మహమ్మారి అయినా… మేమున్నామంటూ ఆర్మీ ఎప్పుడూ జనం మధ్యకు వచ్చి జనంతో మమేకమవడానికి సిద్ధంగా ఉంటుంది. దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ అంతు చూసేందుకు ఆర్మీ రంగంలోకి దూకింది.
కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలకు ఆర్మీ పరిధిలోని హాస్పిటల్స్, లేబరేటరీల వసతులను అందించేందుకు అధికారులతో ఆర్మీ చర్చలు జరుపుతున్నది. తమ వైద్య సిబ్బందిని అత్యధిక ప్రభావిత ప్రాంతాలకు పంపేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ఆర్మీ పాత్రపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఇతర దేశాల్లో ఈ వైరస్ బారిన పడిన సుమారు 1,500 భారతీయులను ఇండియన్ ఆర్మీ సురక్షితంగా స్వదేశానికి తరలించింది. ఆర్మీకి చెందిన పలు క్వారంటైన్ ఫెసిలిటీలలో పర్యవేక్షణలో ఉంచింది. ఇందులో 389 మంది కోలుకున్నారు కూడా. ఇప్పుడు 1,073 మంది ఆర్మీ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ మెడికల్ సిబ్బంది భారత పౌరుల రక్షణ కోసం సిద్ధంగా ఉన్నారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) ల్యాబ్‌లు 20 వేల లీటర్ల శానిటైజర్‌ను ఉత్పత్తి చేసింది. అందులో 10 వేల లీటర్ల శానిటైజర్‌ను ఢిల్లీ పోలీసులకు అందజేసింది. మిగతా శానిటైజర్ ను అనేక సంస్థలకు అందించింది. డీఆర్‌డీవో సహా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కరోనాను కట్టడి చేసేందుకు మాస్కులు, బాడీ సూట్లు, ఇతర రక్షణ పరికరాలను తయారు చేస్తున్నాయి.
Tags : indain army , corona, lockdown, quarantine places, search by army