ఎట్టకేలకు భారత్-ఇంగ్లాండ్ చివరి టెస్ట్ ఫిక్స్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఇంగ్లాండ్-భారత్ మధ్య రద్దు చేయబడిన ఐదవ టెస్ట్‌ మ్యాచ్‌కు ఎట్టకేలకు తేదీ ఖరారైంది. ఈ టెస్ట్‌ను 2022 జూలై 1 నుంచి 5వ తేదీ వరకు రీషెడ్యూల్‌ మ్యాచ్‌ ప్రకటించారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యతతో ఉన్న భారత్ చివరి టెస్ట్ మీద కూడా కన్నేసింది. అటు ఇంగ్లాండ్‌ కూడా సిరీస్‌ను సమం చేసేందుకు ప్రిపేర్ అవుతోంది. అయితే చివరి టెస్ట్ మ్యాచ్‌ను మాత్రం […]

Update: 2021-10-22 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఇంగ్లాండ్-భారత్ మధ్య రద్దు చేయబడిన ఐదవ టెస్ట్‌ మ్యాచ్‌కు ఎట్టకేలకు తేదీ ఖరారైంది. ఈ టెస్ట్‌ను 2022 జూలై 1 నుంచి 5వ తేదీ వరకు రీషెడ్యూల్‌ మ్యాచ్‌ ప్రకటించారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1 ఆధిక్యతతో ఉన్న భారత్ చివరి టెస్ట్ మీద కూడా కన్నేసింది. అటు ఇంగ్లాండ్‌ కూడా సిరీస్‌ను సమం చేసేందుకు ప్రిపేర్ అవుతోంది. అయితే చివరి టెస్ట్ మ్యాచ్‌ను మాత్రం మాంచెస్టర్‌కు బదులుగా ఎడ్జ్‌బాస్టన్‌లో నిర్వహించనున్నట్టు ఇరు జట్ల క్రికెట్ బోర్డు‌లు నిర్ణయించుకున్నాయి.

రీషెడ్యూల్ కారణంగా తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టీ 20, వన్డే సిరీస్‌లు కూడా ఆరు రోజులు వాయిదా పడ్డాయి. టీ 20 సిరీస్ వచ్చే ఏడాది జూలై 7న ఏజాస్ బౌల్‌లో ప్రారంభమవుతుండగా, వన్డే సిరీస్ జూలై 12న ఓవల్‌లో ప్రారంభమవనుంది.

ఎట్టకేలకు టెస్టు సిరీస్‌లోని చివరి మ్యాచ్ కోసం ఇరు దేశాల బోర్డుల మధ్య జరిగిన ఒప్పందం విజయవంతమైనందుకు, అలాగే ఈ మ్యాచ్‌ని రీషెడ్యూల్ చేయడానికి తమకు సహకరించిన అన్ని వేదికలకు కృతజ్ఞతలు తెలుపుతూ BCCI గౌరవ కార్యదర్శి జై షా, ECB చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టామ్ హారిసన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

రీ షెడ్యూల్ వివరాలు..

ఐదవ టెస్ట్ : 1-5 జూలై, ఎడ్జ్‌బాస్టన్

మొదటి T20: 7 జూలై, ఏజాస్ బౌల్
రెండవ T20: 9 జూలై, ఎడ్గ్‌బాస్టన్
మూడవ T20: 10 జూలై, ట్రెంట్ బ్రిడ్జ్

మొదటి వన్డే: 12 జూలై, ఓవల్
రెండవ వన్డే: 14 జూలై, లార్డ్స్
మూడవ వన్డే: 17 జూలై, ఓల్డ్ ట్రాఫోర్డ్

Tags:    

Similar News