భారత్‌లోని 10 శాతం మంది దగ్గరే సగానికి పైగా సంపద!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ నివేదిక తెలిపింది. ప్రస్తుత ఏడాది జాతీయ ఆదాయంలో ఐదో వంతుకు పైగా మొత్తం జనాభాలోని ఒక శాతం మంది వద్దే ఉందని నివేదిక అభిప్రాయపడింది. ఈ ఏడాది మొత్తం జాతీయ ఆదాయంలో ఒక శాతం ధనవంతుల వద్ద 22 శాతం, మొదటి 10 శాతం మంది వద్ద 57 శాతం ఆదాయం ఉంది. భారత్‌లోని వయోజనుల సగటు ఆదాయం రూ. 2,04,200గా ఉందని నివేదిక […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయని వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ నివేదిక తెలిపింది. ప్రస్తుత ఏడాది జాతీయ ఆదాయంలో ఐదో వంతుకు పైగా మొత్తం జనాభాలోని ఒక శాతం మంది వద్దే ఉందని నివేదిక అభిప్రాయపడింది. ఈ ఏడాది మొత్తం జాతీయ ఆదాయంలో ఒక శాతం ధనవంతుల వద్ద 22 శాతం, మొదటి 10 శాతం మంది వద్ద 57 శాతం ఆదాయం ఉంది. భారత్‌లోని వయోజనుల సగటు ఆదాయం రూ. 2,04,200గా ఉందని నివేదిక తెలిపింది. సంపదకు సంబంధించిన అంశంలో కూడా అసమానతలు అత్యధికంగా ఉన్నాయని, దిగువన ఉన్న 50 శాతం కుటుంబాల వద్ద ఎలాంటి సంపద లేదని, మధ్య తరగతి వారు 29.5 శాతం సంపదను కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది.
ఇక, ధనవంతులైన 10 శాతం మంది వద్ద 65 శాతం, 1 శాతం వద్ద 33 శాతం సంపద ఉంది. మధ్య తరగతి కుటుంబాల వద్ద సగటున రూ. 7,23,930 సంపద ఉండగా, 10 శాతం మంది వద్ద సగటున రూ. 63,54,070, 1 శాతం మంది వద్ద సగటున రూ. 3,24,49,360 సంపద ఉంది. 1980ల నుంచి భారత్ ఆర్థిక నియంత్రణ, సరళీకరణ విధానాలు ఈ అసమానతలను పెంచాయని నివేదిక తెలిపింది. ధనవంతులైన 1 శాతం మంది సంస్కరణల వల్ల ఎక్కువ లబ్ధి పొందారని, తక్కువ-మధ్య ఆదాయ వర్గాల వృద్ధి నెమ్మదిగా ఉందని నివేదిక వెల్లడించింది.