ద్రవ్యోల్బణ బాణం.!
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంధన ధరలకు, ఆహార ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించింది. ఈ పరిణామాలతో ఇండియాలోని రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. దీంతో ఏప్రిల్ నెలలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తీగా ఆగిపోనున్నాయి. ద్రవ్యోల్బణం చాలా తక్కువ స్థాయిలో కొనసాగుతుంది. ఇంతకుముందు ఊహించిన దానికంటే వేగంగా కార్యకలాపాలు మందగించడం, ఆహార ద్రవ్యోల్బణం పెరగడం పరిస్థితులను క్లిష్టతరం […]
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంధన ధరలకు, ఆహార ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించింది. ఈ పరిణామాలతో ఇండియాలోని రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో నాలుగు నెలల కనిష్ఠానికి పడిపోయింది. కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. దీంతో ఏప్రిల్ నెలలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తీగా ఆగిపోనున్నాయి.
ద్రవ్యోల్బణం చాలా తక్కువ స్థాయిలో కొనసాగుతుంది. ఇంతకుముందు ఊహించిన దానికంటే వేగంగా కార్యకలాపాలు మందగించడం, ఆహార ద్రవ్యోల్బణం పెరగడం పరిస్థితులను క్లిష్టతరం చేస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారి తెలిపారు. ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం 6.58 శాతం ఉండగా, 5.93 శాతానికి తగ్గిందని ఆర్థికవేత్తలు వెల్లడించారు. ఇది గతేడాది నవంబర్ తర్వాత అత్యల్పం. పరిశీలిస్తే..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా ఉన్న 2 నుంచి 6 శాతానికి దగ్గరగానే నమోదైంది.
‘ఆహార ధరలలో నిరంతరం గణనీయమైన తగ్గుదల ఉంటుందని, అదనంగా సేవల రంగం, రవాణా, కమ్యూనికేషన్, వినోదం వంటి వాటిపై ప్రభావం కారణంగా ద్రవ్యోల్బణం మరింత పడిపోతుందని భారత ఆర్థికవేత్త కునాల్ కుందు అన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ..పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచే అవకాశాన్ని ప్రభుత్వం ఉపయోగించుకున్నది. ఒకరకంగా ఈ పెంపు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆసియాలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇండియా వృద్ధి నెమ్మదిగా విస్తరించిందని, ఈ త్రైమాసికంలో మరింత మందగిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మందగమనాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం రూ. 1.7 లక్షల కోట్ల ఉద్దీపన ప్రణాళికను ప్రకటించింది. ప్రత్యక్ష నగదు బదిలీలు, లాక్‌డౌన్ వల్ల దెబ్బతిన్న లక్షలాది మంది పేదలకు ఉపశమనం కలిగించేలా ఆహార భద్రతా చర్యలు అమలు చేస్తోంది. అంతేకాకుండా, గత నెల 27న జరిగిన అత్యవసర సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకులకు అనుగుణంగా ద్రవ్యలభ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంది.
‘ప్రస్తుతం ఆర్‌బీఐకి ద్రవ్యోల్బణంపై ఆందోళన కానీ దృష్టి కానీ లేదు. ప్రస్తుత సంక్షోభాన్ని గమనిస్తూనే ఉంటుంది. సాంప్రదాయ పద్ధతిలో అసాధారణమైన విధానాలను ఉపయోగిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
Tags: coronavirus, inflation, interest rates, March Inflation, RBI