పారిశ్రామిక వర్గాల్లో తగ్గిన వ్యాపార విశ్వాసం

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా భారత పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం దెబ్బతిన్నదని పరిశ్రమల సంస్థ ఫిక్కీ తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక వెల్లడించింది. అయితే, బలహీనమైన డిమాండ్ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుత సర్వేలో మెరుగైన సామర్థ్య వినియోగం ఉన్నట్టు కంపెనీలు నివేదికలో పేర్కొన్నాయి. దీంతో మొత్తంగా వ్యాపార విశ్వాస సూచీ గతంలో నమోదైన దశాబ్ద గరిష్ఠ స్థాయి 74.2 నుంచి 51.5కి క్షీణించినట్టు ఫిక్కీ ఓ ప్రకటనలో తెలిపింది. ముడిసరుకు ఖర్చులు […]

Update: 2021-05-31 04:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా భారత పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం దెబ్బతిన్నదని పరిశ్రమల సంస్థ ఫిక్కీ తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక వెల్లడించింది. అయితే, బలహీనమైన డిమాండ్ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుత సర్వేలో మెరుగైన సామర్థ్య వినియోగం ఉన్నట్టు కంపెనీలు నివేదికలో పేర్కొన్నాయి.

దీంతో మొత్తంగా వ్యాపార విశ్వాస సూచీ గతంలో నమోదైన దశాబ్ద గరిష్ఠ స్థాయి 74.2 నుంచి 51.5కి క్షీణించినట్టు ఫిక్కీ ఓ ప్రకటనలో తెలిపింది. ముడిసరుకు ఖర్చులు అధికం కావడమే పరిశ్రమలో విశ్వాసం సన్నగిల్లడానికి కారణంగా ఫిక్కీ అభిప్రాయపడింది. ఉపాధి, ఎగుమతుల దృక్పథం కూడా క్షీణించాయని, రాబోయే రెండు త్రైమాసికాలలో నియామక అవకాశాలు స్వల్పంగా ఉంటాయని స్పష్టమైంది. ఎగుమతులు సైతం మునుపటి కంటే మరింత దిగజారినట్టు నివేదిక తెలిపింది. దాదాపు 80 శాతం కంపెనీలు తమ వ్యాపారాలను నిర్వహించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయని నివేదిక వెల్లడించింది.

Tags:    

Similar News